కొన్ని సినిమాలు వెండితెర మీద సత్పలితాలు ఇవ్వకపోయినా స్మాల్ స్క్రీన్ పై అద్భుత విజయాలను అందుకుంటాయి. మహేష్ అతడు సినిమా స్టార్ మాలో ఎన్నోసార్లు వేశారు. ఇప్పటికి వేస్తూనే ఉంటారు. థియేటర్ లో యావరేజ్ మూవీగా నిలిచిన అతడు బుల్లితెర మీద మాత్రం బ్ర్హ్మాండం అనిపించింది. ఇక అదే బాటలో మరికొన్ని సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటకపోయినా సరే స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కోవలోనే యువ హీరో కార్తికేయ నటించిన 90ML సినిమా కూడా వస్తుంది. 

 

సినిమా బాక్సాఫీస్ రేసులో అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. కార్తికేయ, నేహా సోలంకి జోడీగా నటించిన 90 ఎం.ఎల్ సినిమాను శేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి నిర్మించారు. సొంత బ్యానర్ అయ్యే సరికి కార్తికేయకు ఫుల్ ఫ్రీడం దొరికింది. అందుకే వెండితెర మీద సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు. అయితే కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ టైం లో జెమిని టివిలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు కార్తికేయ సినిమాల్లో హయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది.

 

కరెక్ట్ గా సినిమాలు లేకపోవడం.. స్మాల్ స్క్రీన్ పై సీరియల్స్ కూడా రాకపోవడంతో 10.9 రేంజ్ టి.ఆర్.పి రేటింగ్ అందుకుంది 90 ఎం.ఎల్ మూవీ. సినిమా బడ్జెట్ మూడున్నర నాలుగు కోట్ల దాకా కాగా 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే సినిమాకు వచ్చిన టాక్ బాగాలేకపోవడంతో 2 కోట్ల వరకే కలెక్ట్ చేసిందట. కాని బుల్లితెర మీద మాత్రం ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా టి.ఆర్.పి రేటింగ్స్ చూసి చిత్ర దర్శక నిర్మాతలు కూడా షాక్ అయ్యారని చెప్పొచ్చు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: