మన తెలుగులో చాలా వరకు కూడా సినిమాల విషయంలో భారీ బడ్జెట్ ని పక్కన పెడుతున్నారు. హీరోయిన్ లు అయినా సరే హీరోలు అయినా సరే కాస్త ఇప్పుడు రేటు తగ్గించుకుని సినిమాలు చెయ్యాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అని చెప్పవచ్చు. చాలా వరకు మన తెలుగులో స్టార్ హీరోలు అందరూ కూడా రేటు తగ్గించారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు అసలు పారితోషికం అనేది తీసుకోవద్దు అని భావిస్తున్నారట. 

 

అవును ఇక తమకు పారితోషికం వద్దు అని హీరోలు నిర్మాతలకు చెప్పారట. మరి ఏం తీసుకుంటారు అంటారా...? సినిమాలో వాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ తో పాటుగా సినిమా వసూళ్లు కూడా వారికి షేర్ ఉంటుంది అదే విధంగా ప్రాంతాల వారీగా హక్కులను కూడా వాళ్ళు తీసుకుంటారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో ప్రధానంగా చర్చకు వస్తుంది. 

 

త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు ఎన్టీఆర్ నిర్మాత కూడా అని సమాచారం. మహేష్ బాబు పరుశురాం సినిమాకు నిర్మాత కూడా.. వాస్త‌వానికి మ‌హేష్ ఈ స్ట్రాట‌జీని ఎప్ప‌టి నుంచో ఫాలో అవుతూ వ‌స్తున్నాడు. అలాగే చిరంజీవి కూడా ఇప్పుడు కొత్తగా ఆచార్య కు పెట్టుబడి పెడుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోలు నిర్మాతలకు భారం కాకుండా ఉండటానికి గానూ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రేంజ్‌తో పాటు లాభాల‌ను బ‌ట్టి కూడా వీరికి కూడా భారీ రెమ్యున‌రేష‌న్ ద‌క్క‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: