వెంకటేష్ కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఘర్షణ. ఈ సినిమా  టీవీ లో వస్తే జనాలు టీవీ కి అలా అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో వెంకటేష్ నటన గాని దర్శకుడు సినిమాను చూపించిన విధానం గాని అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆసిన్ నటన కూడా బాగానే ఆకట్టుకుంది జనాలను అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ కి కొన్ని కొన్ని భయాలు కూడా ఆయన సినిమాల విషయంలో ఉన్నాయి అని అంటారు. ఈ సినిమాలో ఆయన కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే హాల్ లో కూడా కథ హిట్ అయ్యేది. 

 

మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా అంతగా ఎక్కలేదు. కాని క్లాస్ ఆడియన్స్ విద్యార్ధులు కాస్త జ్ఞానం ఉన్న వాళ్లకు మాత్రం ఈ సినిమా బాగా ఎక్కింది అనే చెప్పాలి. జ్ఞానం అంటే సినిమాలు అంటే రెగ్యులర్ కథ లు కాదు సినిమా అంటే వినూత్నం గా ఉండాలి అని సినిమాల గురించి ఆలోచించే వ్యక్తులకు. ఈ సినిమాను మాస్ త్వరగా రిసీవ్ చేసుకోలేదు. కాని మాస్ ఆడియన్స్ కి కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు నచ్చాయి అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత వెంకటేష్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు నారప్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. కొన్ని కొన్ని సన్నివేశాలను షూట్ చెయ్యాల్సి ఉంది. చాలా వేగంగా ఈ సినిమా షూటింగ్ చేసినా సరే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రానుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: