మన తెలుగులో ప్రభాస్ సినిమాలకు ముందు నుంచి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. బాబు సినిమా వస్తుంది అంటే చాలు కచ్చితంగా సినిమాను చూస్తూ ఉంటారు జనాలు. ఈ సినిమాలో ప్రభాస్ నటన విషయానికి వస్తే ఆయన యువతను ఆకట్టుకునే విధంగా నటిస్తూ ఉంటాడు. అది కూడా జనాలకు బాగానే నచ్చుతుంది అని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా ఒకటి ఉంది. బుజ్జి గాడు... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనాలకు హాల్ లో పెద్దగా నచ్చలేదు గాని బుల్లి తెర మీద మాత్రం బాగా నచ్చింది. 

 

సినిమాను చూడటానికి ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే ఏ మాత్రం కూడా ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా సినిమాను కచ్చితంగా ప్రతీ సీన్ కూడా చూస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన తో పాటుగా మోహన్ బాబు నటన కూడా జనాలకు నచ్చుతుంది. సినిమా కథ విషయంలో కొన్ని కొన్ని జాగ్రతలు తీసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ప్రభాస్ నటన కోసమే చాలా మంది టీవీ చూస్తూ ఉంటారు. ప్రతీ సీన్ లో కూడా చాలా బాగా నటించి మెప్పించాడు ప్రభాస్ అంటారు. 

 

ఇక త్రిష నటన కూడా జనాలకు బాగానే నచ్చింది ఈ సినిమాలో అని చెప్పాలి. ఆమె ప్రతీ సీన్ లో కూడా తన నటన తో ఆకట్టుకుంది. సినిమా వెండి తెర మీద అంతగా హిట్ అవ్వలేదు గాని బుల్లి తెర మీద మాత్రం కామెడి కోసం అయినా సరే సినిమాను ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూసారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: