తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రతీ వారం చాలానే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైతే..  కొన్ని సాదాసీదాగానే విడుదలవుతాయి.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక వెండితెరపై డీలా పడి పోతాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు మంచి హిట్స్ సాధిస్తూ  ఉంటాయి. అయితే వెండితెరపై కొన్ని సినిమాలు ఆడినా ఆడకపోయినా బుల్లి తెరపై మాత్రం ఎంతో క్రేజ్ ని సంతరించుకుంటాయి. వెండితెరపై హిట్ కాకపోయినా బుల్లి తెరపై మాత్రం హిట్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి.. 

 


 అలాంటి సినిమాల్లో ఒకటి జాను. శర్వానంద్ హీరోగా సమంతా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెంచేసింది. సినిమా మంచి విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. 96 అనే తమిళ రీమేక్ సినిమాగా ఈ సినిమా విడుదలైంది. తమిళంలో ఈ సినిమా ఎంతోమంది మదిని తాకి  మంచి విజయాన్ని అందుకుంది అనే  చెప్పాలి. అయితే తెలుగులో మాత్రం అంతగా విజయం సాధించలేకపోయింది ఈ సినిమా. ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. 

 

 కానీ ఈ సినిమాకు బుల్లితెర పై మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది  అనే చెప్పాలి. వెండితెరపై చూడలేనివారు... వెండితెర పై ఈ సినిమాను ఆస్వాదించలేదు  అని అనుకునేవారు బుల్లి తెరపై చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు  ఈ సినిమాపై . రీసెంట్ గా ఈ సినిమా బుల్లితెరపై కూడా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా వస్తున్న సమయంలో రేటింగ్ కూడా బాగానే వచ్చింది. చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా వీక్షించారు. ఇలా అటు వెండి తెర పై అంతగా సత్తా చాటే లేకపోయినప్పటికీ బుల్లి తెరపై మాత్రం ఫీల్ గుడ్ మూవీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది జాను మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: