స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సినిమా కెరియర్ లో వచ్చిన భారీ సినిమా ఆర్య 2. ఒక సినిమా హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమాలో  కాస్త మసాలాలు యాడ్ చేసి రూపొందించిన సినిమా అది. ఈ సినిమాలో ఉన్న కథ నుంచి సినిమాలో ఉన్న  కొన్ని కోణాలు... ఇక ఈ సినిమాలో చూపించిన వ్యక్తులు అన్నీ కూడా కాస్త ఫన్నీగా ఉంటాయి. ఆఫీస్ వాతావరణంలో రిచ్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. కాని జనాలను మాత్రం పెద్ద స్క్రీన్ మీద ఏ మాత్రం మెప్పించలేదు.

 

 

సినిమా కథ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దర్శక నిర్మాతల నుంచి ప్రతీ ఒక్కరు తీసుకుని ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది అని మెగా అభిమానులు అంటున్నారు. కాని ఆ ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా హాల్ లో కంటే టీవీ లో వస్తేనే ఎక్కువగా చూసారు జనాలు అనే సంగతి తెలిసిందే. సినిమాను హాల్ లో పెద్దగా చూడటానికి ఆసక్తి చూపించని జనాలు సినిమా టీవీ లో వస్తే మాత్రం దాని కామెడి ఏ మాత్రం కూడా మిస్ అవకుండా చూస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. 

 

 

బ్రహ్మి కామెడి తో పాటుగా సినిమాలో షియాజీ షిండే  నుంచి వచ్చిన కామేడి కూడా జనాలకు బాగానే నచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత బన్నీ తర్వాత సినిమా కథల ఎంపిక విషయంలో కొంత భయపడ్డారని సినీ వర్గాలు చెప్తున్నాయి.. ఆయన చాలా వరకు  జాగ్రత్త పడే కథలను ఓకే చేసారు అనేది జనాల మాట.అలా భారీ అంచనాలతో వచ్చిన మరోక సినిమా సరైనోడు.. ఈ సినిమాను కూడా బుల్లి తెరపై ప్రేక్షకులు ఆదరించారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: