థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలవుతున్న సినిమాలు వరసగా నిరాశపరుస్తున్నాయి. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి అరడజను కుపైగా సినిమాలు డైరెక్ట్ గా విడుదలకాగా వీటిలో ఏ ఒక్కటి కూడా సూపర్  అనిపించుకోలేకపోయాయి. తెలుగు నుండి ఇటీవల అమృతరామమ్ విడుదలకాగా ఈసినిమా మినిమం రెస్పాన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. అటు హిందీ లో విడుదలైన గులాబో సితాబో కూడా నిరాశపరిచింది. ఇక కోలీవుడ్ లో ఇటీవల విడుదలైన పొన్మగళ్ వందాల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈసినిమాల మీద అంచనాలు కూడా లేవు కానీ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ మాత్రం టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ ఈసినిమా కూడా  బోల్తాపడింది. 
 
ఈరోజు ఈచిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ తమిళం తోపాటు తెలుగు ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఇక ఈసినిమా కు నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమాకు కీర్తి సురేష్ నటన ,సినిమాటోగ్రఫీ మాత్రమే ప్లస్ కాగా  మిగితవాన్ని మైనస్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్  విషయంలో డైరెక్టర్ తడబడడం తో ఫలితం తేడా కొట్టింది. వీక్ డైరెక్షన్ కు తోడు సపోర్టింగ్  క్యాస్ట్ కూడా సినిమా ను చెడగొట్టారు. దాంతో మరో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కూడా నిరాశపరిచింది అయితే నిర్మాతలు మాత్రం వీటి  ఫలితాన్ని ముందే వూహించి థియేటర్ రిలీజ్ లేకుండా ఓటిటి లకు అమ్ముకొని సేఫ్ అయ్యారు.
 
ఇక  బాలీవుడ్ నుండి త్వరలో శకుంతలా దేవి , గుంజన్ సక్సేనా.. తెలుగు నుండి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలు  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్నాయి. మరి ఈసినిమాలు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: