మెగా కాంపౌండ్ లో పెళ్లి సందడి మొదలైంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక యొక్క వివాహం గుంటూరు వాసి జొన్నలగడ్డ చైతన్యతో ఫిక్స్ అయింది. అసలు ఈ పెళ్లి సంబంధం తేవటం విషయంలో రెండు కుటుంబాలకు మధ్య పెద్ద రకంగా కీలక పాత్ర పోషించింది మెగాస్టార్ చిరంజీవి అని మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. వరుడు చైతన్య తల్లి గారు జె. పద్మ గారు తండ్రి సుగుణ వెంకటరత్నం గారు అదేవిధంగా చిరంజీవి తండ్రి కొణిదల వెంకట రావు గారు ఇద్దరూ చిన్నప్పటినుండి మంచి స్నేహితులు అట. వీళ్లిద్దరు చిన్ననాటి నుండి మంచి ఫ్రెండ్స్ కావటంతో జె పద్మ గారు కూడా చిన్ననాటి నుండి చిరంజీవికి మంచి స్నేహితురాలు కావడంతో పద్మాగారు పెళ్లయిన తర్వాత ఆమె భర్త జొన్నలగడ్డ ప్రభాకర్ తో మంచి స్నేహం కుదిరిందట.

IHG

పైగా ప్రభాకర్ పోలీస్ శాఖలో కీలక పదవిలో ఉండే వ్యక్తి కావడంతో సమాజంలో అనేక విషయాల గురించి ప్రభాకర్ మరియు చిరంజీవి చర్చించుకునే వారట. ఇదే సమయంలో  కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారట. ఈ నేపథ్యంలో ఇటీవల జొన్నలగడ్డ ప్రభాకర్ తన కొడుకు చైతన్య కి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు చిరంజీవితో మాటల్లో మాట తెలిపారట.

IHG's Acharya?

ఆ తర్వాత ఈ విషయం గురించి బాగా ఆలోచించిన చిరంజీవి ఎవరికో ఎందుకు తన కుమార్తె నిహారికని ఇచ్చి చేస్తే అన్ని విధాలా బాగుంటుందని భావించి చిరంజీవినే ఈ పెళ్లి ప్రపోజల్ ని ప్రభాకర్ రావు వద్దకు తీసుకెళ్లారట. మరోపక్క నాగబాబు... అన్నయ్య చిరంజీవి ఏది చేసిన కరెక్ట్ గా ఉంటుంది అని ఏమీ ఆలోచించకుండా… మొత్తం విషయం తీసుకెళ్లి నిహారిక ముందు పెట్టారట. నిహారిక చైతన్య తో పరిచయం పెంచుకుని ఇష్టాయిష్టాలు తెలుసుకుని చివరాఖరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మొత్తం మీద నాగబాబు కూతురు నిహారిక పెళ్లి విషయంలో చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు వార్తలు ప్రస్తుతం బలంగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: