టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే సినిమాల విషయంలో నిర్మాతలు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అది స్టార్ అయినా మరొకరు అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాతే  సినిమాకు ఓకే చెప్తున్నారు గాని ఏ మాత్రం తొందర పడి సినిమాలను చెయ్యాలి అని చూడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా మరొకరు అయినా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో దూకుడుగా సినిమాలు చేస్తే అసలుకే మోసం  వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంచనా వేస్తున్నారు. 

 

అందుకే ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే చాలా వరకు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం గతంలో మాదిరిగా ఏ విధంగా కూడా త్వర పడి చేయడం లేదని అంటున్నారు జనాలు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే మెగా హీరోలు అందరూ కూడా బడ్జెట్ ని భారీగా తగ్గించారు అని సమాచారం. చిన్న హీరోలు కూడా కాస్త తగ్గించుకుని సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. ఇటీవల చిరంజీవి ఇచ్చిన ఒక సలహా  మేరకు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుని భారీగా తగ్గించారు అని తెలుస్తుంది. దానికి కారణం సినిమాలకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఉండటమే అంటున్నారు జనాలు. 

 

సినిమాలు ఇప్పుడు బ్రతకాలి అంటే మాత్రం ఎక్కువ రేట్ అవసరం లేదు అని కాబట్టి నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసుకోవాలి అని చిరంజీవి సూచనలు చేసినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ అయితే ఏకంగా 4 కోట్ల వరకు తన రేట్ తగ్గించాడు అని సమాచారం. ఇక బన్నీ కూడా తగ్గించాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: