ఇప్పుడు మన తెలుగులో హీరోయిన్ ల కొరత ఎక్కువగానే ఉంది. ముందు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి గానూ హీరోయిన్ లు అసలు దొరకడం లేదు అని అంటున్నారు జనాలు. అవును స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి గానూ హీరోయిన్ ల కొరత చాలా తీవ్రంగా ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఏ హీరో అయినా సరే పరిస్థితి అదే విధంగా ఉంది అని అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు ఇతర భాషల్లో ఉండే హీరోయిన్ లను తీసుకుని రావాలి అని నిర్మాతలు దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

అయితే అది సాధ్యం కావడం లేదని వాళ్ళు మరీ దారుణంగా చెప్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ మాత్రం జాలీ దయా లేకుండా చెప్తున్నారు అని కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో వచ్చే అవకాశాలను వాళ్ళు అసలు ఏ మాత్రం వదులుకునే ఆలోచనలో లేరు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో భారీగా లాగేయాలి అని నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న అవసరాల ఆధారంగా సినిమాలు చేస్తున్నారు అని అంటున్నారు. 

 

మన తెలుగులో ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు ఇద్దరు హీరోయిన్ లతో మాత్రమే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు దాదాపుగా ఇతర భాషల మీద ఆలోచన పెట్టారు. ఇప్పుడు అదే నిర్మాతలను కొంప ముంచుతుంది. అవకాశాలు వాళ్ళు వదులుకోవడం లేదు అదే విధంగా భారీగాను డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఫోన్ వస్తే చాలు ఇక ఏ మాత్రం కూడా ఆ సినిమాను లైన్ లో పెట్టాలి అనే విధంగానే ఆలోచన చేస్తూ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు అని టాక్ వినపడుతుంది. చూడాలి మరి మన స్టార్ హీరోలు ఎం చేస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: