అగ్ర హీరోల విషయంలో మన తెలుగులో చాలా  జాగ్రత్తలు తీసుకుంటారు అనేది తెలిసిందే. ప్రతీ సినిమా విషయంలో కూడా జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. కమర్షియల్ సినిమాలను తీసుకుని రావడానికి గానూ తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కాదు.  ఇక హీరోయిన్ ల నుంచి ఇతర నటుల వరకు కూడా ఒక రేంజ్ ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ సినిమాలకు కమర్షియల్ అనే గుర్తింపు అనేది వస్తు ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే టాలీవుడ్ లో చాలా వరకు అగ్ర హీరోల సినిమాలకు బడ్జెట్ ని భారీగా తగ్గించే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. 

 

అందుకే గతంలో తీసుకునే స్టార్ నటీ నటులను పక్కన పెట్టాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అని సమాచారం. ప్రస్తుతం అది అవసరం లేదు అని తక్కువ ధరకే చేసే వాళ్ళనే తీసుకోవాలి అని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియ, ప్రగతి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్ సహా కొందరిని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇక మాజీ హీరోయిన్ లను కూడా వద్దు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దాదాపుగా మన తెలుగులో అగ్ర హీరోలు అందరూ కూడా బడ్జెట్ తక్కువ సినిమాలను మాత్రమే చేయడం మంచిది అనే నిర్ణయానికి వచ్చేశారు అని తెలుస్తుంది. 

 

చూడాలి మరి అసలు ఎవరిని పక్కన పెడతారు అనేది. అగ్ర హీరోల విషయంలో టాలీవుడ్ లో  ఈ మధ్య భయం కూడా ఎక్కువైన సంగతి తెలిసిందే. దానికి కారణం వారి సినిమాలకు మార్కెట్ తగ్గడమే. ఇక ప్రజలు కూడా ఇప్పుడు సినిమా చూసే అవకాశం లేదు అని తెలుస్తుంది. అందుకే ఇక నుంచి జాగ్రత్తలు పడటమే మంచిది అనే నిర్ణయానికి వచ్చేశారట నిర్మాతలు దర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: