టాలీవుడ్ ఇపుడు ఎన్నడూ లేని విధంగా ఉంది. ఆ మాటకు వస్తే సినీ పరిశ్రమ మొత్తం అలా ఉంది. కరోనా మహమ్మారి వల్ల సినిమాలు లేవు, షూటింగులు లేవు. లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఖాళీ అయింది సినిమా నటులు, టెక్నీషియన్లేనని చెప్పాలేమో

IHG

సరే దొరికింది కదా ఖాళీ అని సినీ ప్రముఖుల మనసు పెళ్లి మీద పడినట్లుంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్స్ ఇపుడు పెళ్లి అంటూ కలవరిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకు, నటుడు రానా పెళ్ళి కూతురుని ఈ లాక్ డౌన్ వేళ బయటపెట్టేశారు. ఆగస్ట్ లో పెళ్ళికి  నిశ్చితార్ధం అంటున్నారు. ఆ తరువాత పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. సో రానాకు లాక్ డౌన్ అలా కలసివచ్చిందన్న మాట.

IHG's Official : <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NIHARIKA KONIDELA' target='_blank' title='niharika <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KONIDELA PRODUCTION' target='_blank' title='konidela-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>konidela</a> -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>niharika <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KONIDELA PRODUCTION' target='_blank' title='konidela-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>konidela</a> </a>Gets Engaged - ManaTeluguMovies.net

ఇక ఆ వరసలో యువ నటుడు నిఖిల్ ఏకంగా పెళ్ళి చేసుకున్నాడు. ఈ లాక్ డౌన్ వేళ పెళ్లి చేసుకుంటే కొన్నాళ్లు అయినా కొత్త జీవితం ఆస్వాదించవచ్చు అని నిఖిల్ కరెక్ట్ గా ప్లాన్ చేశాడనుకోవాలి. మరో హీరో నితిన్ మాత్రం కరోనా తగ్గిన తరువాతనే పెళ్ళి అంటున్నారు. ఆయన కూడా పెళ్ళి పీటల దాకా తెచ్చేశారు. ఇక హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన మెగా డాటర్ నీహారిక సైతం ఇపుడు పెళ్లి కూతురు అయింది. 

IHG

ఆమె గుంటూరుకి చెందిన చైతన్యను పెళ్ళాడనుంది. ఆగస్టులో నిశ్చితార్ధం జరుగుతుంది. ఈ ఏడాది ఎండింగుకైనా లేక వచ్చే ఏడాది అయినా నీహారికకు పెళ్ళి జరిగే చాన్స్ ఉంది. మరోవైపు కీర్తి సురేష్ సైతం లవ్ లో పడిందని అంటున్నారు. ఆమె కూడా కరోనా తరువాతనే పెళ్ళి పీటలెక్కుతుందని అంటున్నారు.

IHG

సీనియర్ హీరోయిన్ అయిన అనుష్క అయితే పెళ్ళి చేసుకుంటుందని మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. అలాగే చూసుకుంటే కాజల్ అగర్వాల్, తమన్నా వంటి వారు కూడా పెళ్ళి మీద మనసు పారేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఇంటిపట్టునే ఉంటోంది. ఆమె కూడా సినిమా షూటింగులు లేకపోవడంతో పెద్దల మాట బుద్దిగా వింటాను అంటోందిట. చూడాలి కరోనా మహమ్మారి తగ్గేసరికి ఎంతమంది సినీ తారల  పెళ్ళిళ్ళు జరుగుతాయో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: