మళయాళ భామ కీర్తి సురేష్ ప్రేమలో పడ్డదా.. మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకుని తన ప్రతిభ చాటిన కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారంపై కొన్నాళ్లుగా మీడియాలో హడావిడి నడిచింది. ఓ బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ ప్రేమలో పడ్డదని త్వరలోనే వీరి పెళ్లి జరుగనుందని అన్నారు. అయితే ఈ వార్తలను అప్పుడే కొట్టిపారేసింది అమ్మడు. ముందు కెరియర్ ఆ తర్వాతే పెళ్లి అన్నట్టు మాట్లాడింది. అందరి హీరోయిన్స్ పెళ్లి వార్తలానే ఇది కూడా గాసిప్ అని అనుకున్నారు.

 

అయితే మీడియా ఇన్నర్ టాక్ ఏంటంటే కీర్తి సురేష్ లవ్ లో ఉన్న మాట వాస్తవమే కాని ప్రస్తుతం కమిటైన సినిమాలు.. చేయాలని అనుకున్న సినిమాలు చేసి కాని కీర్తి ఈ విషయాన్ని రివీల్ చేస్తుందట. నాగ చైతన్య, సమంతల టైం లో కూడా సీక్రెట్ గా వ్యవహారం నడిపించి సీక్రెట్ గా కలుసుకుని కూడా మ్యాటర్ లీక్ చేయకుండా సడెన్ గా పెళ్లితో షాక్ ఇచ్చారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అలానే పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

 

పెళ్లి వార్తలపై పైకి లేదని చెప్పినా కచ్చితంగా అమ్మడు ఏదో దాస్తుందని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కీర్తి సురేష్ ప్రేమలో పడటం నిజమే అయితే మాత్రం అతనెవరో కాని చాలా లక్కీ అని చెప్పొచ్చు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో తన నట విశ్వరూపం చూపించింది. లేటెస్ట్ గా కీర్తి సురేష్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా హిట్టైతే అమ్మడికి మళ్లీ తెలుగులో లక్ కలిసి వచ్చినట్టే.                    
 

మరింత సమాచారం తెలుసుకోండి: