2007లో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసింది కాజల్ అగర్వాల్. తేజ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో కళ్యాణ్ రాం హీరోగా నటించాడు. ఆ సినిమా తర్వాత కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన చందమామ సినిమాతో టాలీవుడ్ లో తన సీటు ఖాయం చేసుకుంది కాజల్. అప్పటి నుండి అమ్మడి కెరియర్ ఊపందుకుంది. ఇక రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన మగధీర సినిమాలో మిత్రవింద, బిందు పాత్రల్లో నటించిన కాజల్ కెరియర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. అప్పటినుండి వరుస స్టార్ ఛాన్సులతో సత్తా చాటుతుంది అమ్మడు. 

 

దశాబ్ధ కాలంగా పైగా సినిమాలు చేస్తున్న కాజల్ ఇప్పటికి స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇక కెరియర్ లో కొన్నాళ్లు వెనుకపడినా మళ్లీ వరుస అవకాశాలతో తన సత్తా చాటింది అమ్మడు. సీనియర్ హీరోల సరసన నటించడానికి మిగతా భామలు వెనుకడుగు వేస్తున్న టైం లో కాజల్ మాత్రం చిరు ఖైది నంబర్ 150లో జోడీ కట్టి మెప్పించింది. జూన్ 19 కాజల్ 35వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఊహించని విధంగా ఈసారి అమ్మడి పేరు మీద బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ లో తెగ హంగామా చేశాయి.

 

తెలుగులో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి పీక్స్ లో ఉన్న టైం లో కన్నా ఇప్పుడు కాజల్ అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటున్నా సరే బర్త్ డే నాడు #Happybirthdaykajal, #HBDkajalAgarwal హ్యాష్ ట్యాగ్స్ తో ఆమె ఫ్యాన్స్ హడావిడి చేశారు. ఈరోజు ట్విట్టర్ ట్రెండింగ్స్ లో కాజల్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉండటం విశేషం. చూస్తుంటే ఈ క్రేజ్ తో కాజల్ మరో ఐదారేళ్లు సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించేలా ఉంది. ఓ హీరోయిన్ బర్త్ డే అది కూడా ఫాంలో లేని కాజల్ కు బర్త్ డే ట్రెండ్ కావడం చూసి స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. ఇక మిగతా హీరోయిన్స్ అయితే కాజల్ ఫాలోయింగ్ చూసి ఈర్ష్య పడుతున్నారని చెప్పొచ్చు. కాజల్ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న మోస్గాళ్లు సినిమా నుండి ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: