మాధవన్ హీరోగా శాలిని హీరోయిన్ గా మనిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమానే సఖి. 2000 విడుదల అయినా ఈ సినిమా ఇప్పటికి అంటే 2020లో కూడా మళ్ళీ చూడాలి అని అనిపించే లవ్ స్టోరీ సఖి. అలాంటి ఈ సఖి సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. యూత్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సినిమా ఇది. 

 

IHG

 

తమిళ్ లో చిత్రకరణైనా ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ట్రెండ్ సృష్టించింది ఈ సినిమా. 2000 వరకు ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి సినిమా అప్పటి వరుకు రాలేదు.. అందుకే ఈ సఖి సినిమా లవ్ స్టోరీ ఇప్పటికి ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు అంటున్నారు సహజీవనం అది ఇది అని.. కానీ మని రత్నం మదిలో అప్పటికే సహజీవనం గురించి ఆలోచనలు ఉన్నాయి. 

 

IHG

 

ఇంకా ఈ సినిమా చుశాకనే అబ్బాయిలకు కూడా కాస్తో కూస్తో అమ్మాయిలకు ప్రపోజ్ చేసే దైర్యం వచ్చింది.. ఎందుకు అంటారా.. మాధవన్ హీరోయిన్ షాలిని ఎంత దైర్యంగా ప్రపోజ్ చేస్తాడు.. ట్రైన్ కదులుతున్న సమయంలో చెప్పకనే చెప్పడం మాములు విషయం కాదు. అందరికి వావ్ అనిపించి ప్రేపోజ్ చెయ్యాలి అనిపించేలా మాధవన్ ప్రేపోజ్ చేస్తాడు.. ఇంకా ఈ సినిమాలో ఏ.ఆర్. రెహమాన్ పాటలు ఇప్పుడు విన్న మంచి ఫీల్ వస్తుంది. 

 

IHG

 

ఇలా కథ, స్క్రీన్ ప్లే, నటన, సంగీతం, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా ఎంతో అద్భుతమైన సినిమా సఖి. ఇప్పుడు కూడా లవ్ స్టోరీస్ వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ ఇలాంటి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాలు మాత్రం రావడం లేదు. మరి ఈ మంచి ఫీల్ ఇచ్చే ప్రేమ కథను ఈ లాక్ డౌన్ లో చుడండి.. ఎంజాయ్ చెయ్యండి!

మరింత సమాచారం తెలుసుకోండి: