తెలుగులో అనేక ప్రేమకథలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువగా పేద, ఉన్నతవర్గాల్లోని యువతీ యువకుల మధ్య జరిగే ప్రేమకథలే ఎక్కువ. ఆ ట్రెండ్ ను కొద్దిగా మార్చి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ రాక ఎక్కువైంది. ఈ తరహా ప్రేమకథలు కూడా మనకు ఎక్కువగానే వచ్చాయి. ఈ తరహాలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాల్లో ఒకటి ‘వర్షం’. ఈ సినిమా ట్రాయంగిల్ లవ్ స్టోరీ కాకపోయినా మూడో వ్యక్తి ప్రమేయంతో కథ నడుస్తుంది. ఆ అడ్డంకులన్నీ దాటుకుని ప్రేమ జంట ఒక్కటెలా అయిందనేది ఈ చిత్ర కథాంశం.

IHG

 

సినిమాలో బాగా ఆకట్టుకునేది క్యాస్టింగ్. ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా.. గోపీచంద్ విలన్ గా నటించారు, ప్రభాస్-త్రిష మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వర్షం నేపథ్యంలో ప్రేమ వంటి కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. మధ్యలో ఓ రౌడీ వచ్చి త్రిషను పొందాలని హీరోయిన్ తండ్రి చేత కుయుక్తులు పన్నడం వంటి అంశాలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. ప్రభాస్-త్రిష మధ్య అపార్ధాలు సృష్టించి వారిద్దరూ విడిపోయేలా చేస్తాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ఇగో క్లాష్ వచ్చి విడిపోవడం ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు.

IHG

 

త్రిషను కాపాడటానికి వచ్చిన సమయంలో వారిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించడం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. హీరోగా ప్రభాస్ కు, హీరోయిన్ గా త్రిషకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్, త్రిష క్యూట్ లుక్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు హంగు, ప్రతి పాట కూడా హిట్ అయింది. ‘ఇన్నాళ్లకి గుర్తొచ్చొనా వానా..’ సూపర్ హిట్. అందమైన ప్రేమకథగా ‘వర్షం’ యూత్ ని మంచి వర్షపు చినుకుల్లో తడిపేసింది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: