టాలీవుడ్ లో పోకిరి సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించింది అనే విషయం అందరికి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. ఈ సినిమాకు ముందు మహేష్సినిమా తర్వాత మహేష్ అనే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో మహేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ సీన్ లో కూడా అతను ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే  చెప్పాలి. ఇక మహేష్ తో పాటుగా సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా తమ శైలి లో చాలా బాగా నటించారు అనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఇలియానా కు తన ప్రేమను చెప్పే విషయంలో మాత్రం కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి జనాలకు అని చెప్పాలి. అవును ఇలియానా కు తన ప్రేమను చెప్పడానికి గానూ మహేష్ బాబు కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆమె చెప్తున్న క్లాస్ వద్దకు వెళ్లి ఆమెను చూడటం ఆమెను ఫాలో కావడం ఆమె ఫ్యామిలీ మీద కేర్ తీసుకోవడం ఇలాంటి సంఘటనలతో ఆమె కు తన ప్రేమను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. ఇక అదే విధంగా ఆమెకు కష్టం వచ్చిన సమయంలో తాను ఉన్నా అనే భరోసాను కలిగిస్తాడు. 

 

ఇక ఆ సినిమాలో ఇలియానా కూడా కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా నటించింది అని చెప్పాలి. ఆమె దాదాపు అన్ని సీన్స్ లో కూడా తన మార్క్ నటన చూపించింది. ఇక ఆ సినిమా తర్వాత వాళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ మరో సినిమా రాలేదు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: