2004వ సంవత్సరంలో ఆర్య సినిమాని తెరకెక్కించిన సుకుమార్ 2009వ సంవత్సరంలో ఆర్య2 చిత్రాన్ని తెరకెక్కించి సినీ ప్రేక్షకులను మళ్లీ బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలో నటించారు. అజయ్(నవదీప్), ఆర్య(అల్లు అర్జున్) అనాధ శరణాలయంలో బతుకుతూ ఉండగా... ఒక ధనిక దంపతులు ఇద్దరిలో ఎవరినో ఒకరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆర్య రూపాయి బిల్ల తో టాస్ వేసి ఎవరు ధనిక దంపతులతో వెళ్ళిపోవాలో డిసైడ్ చేయాలనుకుంటాడు. ఈ టాస్ లో ఆర్య గెలుస్తాడు కానీ స్నేహం అంటే త్యాగం చేయడమే అని చెప్పి తన ఫ్రెండ్ అజయ్ ని ధనిక దంపతులతో వెళ్ళిపోమంటాడు. అయితే అజయ్ మాత్రం చాలా సంతోషంగా ఆర్య ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దీనిబట్టి అజయ్ కి ఆర్య మీద ఎటువంటి ప్రేమ లేదని ప్రేక్షకులకి ముందుగానే తెలుస్తుంది. 

 

IHG

 


అజయ్ పెరిగి పెద్దవాడు అయ్యేవరకు ఆర్య అనాధ శరణాలయం లోనే ఉండి ఆపై అతడి స్నేహితుడిని వెతుక్కుంటూ సిటీలో అరంగేట్రం చేస్తారు. ఆ తర్వాత అజయ్ సొంత కంపెనీలో ఆర్య ఉద్యోగిగా చేరతాడు. ఈ క్రమంలోనే గీత అదే ఆఫీస్ లో జాయిన్ అవ్వగా... ఆర్య ఆమెను కలిసిన వెంటనే లిప్ కిస్ ఇస్తాడు. ఆ క్షణం నుంచే ఆర్య పై విపరీతమైన కోపం పెంచుకుంటుంది గీత. అనాధ శరణాలయం లో ఒంటరిగా పెరిగి ఒక భయంకరమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న ఆర్య తన ప్రేమను గీతకు చెప్పే క్రమంలో ఎన్నో పిచ్చి పిచ్చి పనులను చేస్తూ ఆమెను నానా ఇబ్బందులు పెడతాడు. దీంతో ఆమెను ఓదారుస్తూ ఉంటాడు అజయ్. ఒకానొక క్రమంలో ఆర్య నుంచి తప్పించుకునేందుకు గీత అజయ్ కి ఐలవ్యూ చెబుతోంది. ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరినీ విడదీసేందుకు ఆర్య రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు.

 

IHG


అయితే క్లైమాక్స్ వరకు ఆర్య క్యారెక్టర్ చాలా చెత్తగా ఉండటం వలన ప్రేక్షకులకి అసంతృప్తే మిగిలింది అని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో మాత్రం ఆర్య నిజమైన క్యారెక్టర్ చూపించే ప్రజలకు సంతృప్తికరమైన ఎండింగ్ ని సుకుమార్ ప్రసాదించాడు. ఈ చిత్రంలో ఫస్టాఫ్ లో త్యాగం చేస్తున్నట్టు కనిపించే స్వార్థపరుడిగా ఆర్య క్యారెక్టర్ ఉంటుంది. ఆర్య 2 లో ఈ క్యారెక్టరైజేషన్ ని పెద్ద నెగటివ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆర్య(2004) సినిమాలో కథానాయకుడు గీత ని చాలా నిజాయితీగా ప్రేమిస్తుంటాడు. కానీ ఆర్య 2 సినిమాలో ఆ నిజాయితీ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆర్య లో లాగా ఆర్య 2 చిత్రంలో మనసును హత్తుకునే సన్నివేశాలు ఎక్కడ ఉండవు. సుకుమార్ రాసిన కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది కానీ ఆర్య కథ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: