ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు 13 వేల స్థాయికి చేరుకోవడంతో పాటు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు దరిచేరుతూ తెలుగు రాష్ట్రాలలో కూడ ఈకేసుల సంఖ్య రికార్డు స్థాయికి చేరిపోవడంతో ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.


ఇండస్ట్రీకి సంబంధించి మార్చి నుండి సెప్టెంబర్ వరకు ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నీ వెనక్కు వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాణం జరుపుకుంటున్న టాప్ హీరోలు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు అన్నీ పూర్తి కావడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఇప్పుడు ప్లానింగ్ లో ఉన్న టాప్ హీరోలు మిడిల్ రేంజ్ హీరోలు బిలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు అన్నీ మరో ఆరు నెలల వరకు ప్రారంభించకూడదని ఇండస్ట్రీలోని అనేకమంది నిర్మాతలు ఒక స్థిరనిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించి విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు అలాగే సగం నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చాక కొత్త సినిమాల గురించి ఆలోచనలు చేద్దామని అప్పటి వరకు కొత్త సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను ఆపేయాలని ఆలోచనలు చాలామంది నిర్మాతలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోపు ధియేటర్లు ఓపెన్ అవ్వడంతో పాటు అసలు జనం ధియేటర్లకు వస్తారా రారా అన్న విషయం పై క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి ఉండటం అన్నివిధాల శ్రేయస్కరం అని నిర్మాతల భావన అనిఅంటున్నారు.


ఇప్పుడు ఈనిర్ణయానికి సంబంధించిన లీకులు బయటకు రావడంతో చిన్నచిన్న వేషాలు వేసుకునే నటీనటులు తమ ఉపాది ఎలాగా అని ఆలోచనలు చేస్తుంటే రాబోతున్న ఆరు ఏడు నెలల కాలంలో జనం తమను మర్చిపోకుండా ఉండటానికి సోషల్ మీడియాలో ఎలాంటి పోష్టులు పెడుతూ వివిదాలకు దూరంగా జనం మధ్య హాట్ టాపిక్ గా ఎలా కొనసాగాలో అర్ధంకాక టాప్ హీరోల దగ్గర నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్ సలహాలు అడుగుతూ తమ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: