క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య(2004) మూవీ లో అల్లు అర్జున్, అనురాధ మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన రొమాంటిక్ సినిమాలలో ఆర్య మూవీ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అన్ని సినిమాల్లో హీరోయిన్ ప్రేమిస్తే హీరో నే తప్ప మిగతా ఎవరిని ప్రేమించదు కానీ ఆర్య సినిమా లో హీరోయిన్ హీరో ని కాదని మరొకరిని ప్రేమిస్తుంది. ఆ మరొకరిని ప్రేమిస్తున్న హీరోయిన్ వెనుకే హీరో పడతాడు. ఈ సినిమా మొదటి ఆట ని చూసిన వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి విమర్శలు ఏ స్థాయిలో వెల్లువెత్తాయో ప్రశంసలు కూడా ఆ స్థాయిలోనే వచ్చిపడ్డాయి. అప్పట్లో ఈ సినిమాని మణిరత్నం సినిమా తో పోల్చిన విమర్శకులు సైతం ఉన్నారంటే ఆర్య మూవీ ఒక కళాఖండం అని అర్థం చేసుకోవచ్చు. 

 

IHG


సినిమా కథ గురించి తెలుసుకుంటే... ఎంపీ అవతారం(రాజన్ పి దేవ్) కుమారుడైన అజయ్(శివ బాలాజీ) గీత(అనురాధ మెహతా) ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత తనని ప్రేమించకపోతే భవనంపై నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించి గీతా ని తనని ప్రేమించేలా చేస్తాడు అజయ్. ఈ క్రమంలోనే ఆర్య(అల్లు అర్జున్) గీతా ను చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు. అప్పటికే గీత అర్జున్ ప్రేమలో వుండగా అది తెలిసి కూడా ఆర్య నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు కానీ నా ప్రేమను మాత్రం ఫీల్ అవ్వు అని ఆమె వెంటపడుతుంటాడు. సినిమా ఫస్టాఫ్ వరకు ఆర్య గీత వెంట పడే తీరు ఎవరికీ నచ్చదు కానీ సెకండాఫ్ లో ఆర్య క్యారెక్టర్ కి గీత తో పాటు ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోతారు. 

 

IHG

సున్నితమైన ఈ లవ్ స్టోరీ లో ఆర్య క్యారెక్టర్ ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎప్పుడైతే గీత ఆర్య పై ఫీలింగ్స్ పెంచుకుంటుందో ఆ క్షణం నుంచి ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంటాయి. ప్రతి మనిషికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని... ఆ ఫీలింగ్స్ ని వ్యక్తపరచుకుండా ఉండలేరని ఆర్య సినిమాలో సుకుమార్ చాలా చక్కగా చూపించాడు. అలాగే తన సినిమా ద్వారా ప్రేమకి సరికొత్త నిర్వచనం చెప్పి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: