తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ మాయ చేసావే సినిమాను తమిళం నుంచి రీమేక్ చేశారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారన్నారు. ఈ సినిమాలో తెలుగులో నాగచైతన్య, సమంత నటించారు. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా కనిపించిన తొలి చిత్రం ఏ మాయ చేసావే. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందన్నారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.  

 

IHG

 

ఈ సినిమాలో సమంత డబ్బింగ్ వాయిస్ తో పాటు నాగచైతన్య ఒరిజినల్ హస్కీ వాయిస్ కూడా చాలా మధురంగా ఉండటం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలోని 7 పాటలలో 6 పాటలను అనంత శ్రీరామ్ రచించగా... ఆరోమాలో పాటను మాత్రం కైతప్రం రచించారు. ఈ అద్భుతమైన పాటలకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం తోడవ్వగా... అవన్నీ అద్భుతమైన ఎవర్ గ్రీన్ పాటలుగా నిలిచాయి. కాగా కుందనపు బొమ్మ పాటను అనంత శ్రీరామ్, కళ్యాణీ మీనన్ కలసి సంయుక్తంగా రచించారు.

 

IHG


నాగచైతన్య, సమంత ల కెమిస్ట్రీ కి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే అని చెప్పుకోవచ్చు. వింటున్నావా సాంగ్ లో నాగచైతన్య, సమంత చేసే రొమాన్స్ ప్రేక్షకులను టీవీలకు కట్టేసింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మనం, మజిలీ సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్స్ గా నిలిచాయి. 2014 సంవత్సరంలో విడుదలైన మనం సినిమాలో నాగచైతన్య సమంతల మధ్య చోటుచేసుకునే కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. 2019 వ సంవత్సరం లో విడుదలైన మజిలీ లో కూడా వీరిద్దరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు కన్నుల విందుగా మారిందంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి అందరు మంత్ర ముగుద్దులను చేశారు. ఈ సినిమాతోనే రీల్ జోడి కాస్త రియల్ జోడిగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: