టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ హిట్ మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేష్ మహేష్ బాబు హీరోలు గా వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే హీరోల నటన కోసం అయినా సరే కచ్చితంగా సినిమా చూస్తూ ఉంటారు జనాలు అనేది వాస్తవం. ఇక ఈ సినిమాలో హీరోలు నటన తో పాటుగా ప్రధాన పాత్రలో ఉన్న అంజలి కూడా చాలా అందంగా నటిస్తుంది అనే చెప్పాలి. అదే విధంగా ఈ సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరు కూడా చాలా అందంగా తమ స్థాయికి తగిన విధంగా నటించారు అనే చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే వెంకటేష్ అంజలి మధ్య జరిగే కొన్ని కొన్ని సన్నివేశాలు జనాలకు ఇంకా గుర్తున్నాయి. వాళ్లకు ఒకరు అంటే ఒకరి  మీద ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమను వాళ్ళు బయటకు చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే అంజలి మాత్రం వెంకటేష్ అంటే  ఉన్న ఇష్టాన్ని ప్రతీ సందర్భం లో కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమెకు పెళ్లి చూపులకు వచ్చిన సమయంలో కూడా ప్రతీ సీన్ కూడా ఆకట్టుకుంది. ఇక వెంకటేష్ కూడా చివరి వరకు ఆమెకు తన ఇష్టాన్ని చెప్పే ప్రయత్నం చేయడు. 

 

అలా ఆ సినిమాలో ప్రతీ సీన్ కూడా జనాలకు చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడానికి ఆ ఇద్దరే కారణం అని అంటారు. మహేష్ బాబు కూడా ఈ సినిమాలో సమంతాకు తన ప్రేమను చెప్పడానికి చేసే ప్రయత్నాలు కూడా జనాలకు నచ్చాయి అనే చెప్పాలి. ఆ విధంగా ఈ సినిమా ఆకట్టుకుంది టాలీవుడ్ ని.

మరింత సమాచారం తెలుసుకోండి: