టాలీవుడ్ లో ఫిదా సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన  నుంచి సాయి పల్లవి నటన ఆన్నీ కూడా హైలెట్. ఇక ఈ సినిమా కథ ఈ సినిమాలో ఉండే పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడినా హైలెట్ అయింది మాత్రం సాయి పల్లవి అని చాలా మంది అంటారు. ఆమె నటన కోసమే సినిమాను రెండు సార్లు మూడు సార్లు చూసారు జనాలు అని చెప్పాలి. ఇక ఆ సినిమాలో వాళ్ళు ఇద్దరూ ప్రేమించుకునే విధానం బాగా నచ్చింది ప్రేక్షకులకు అనే చెప్పాలి. 

 

ప్రతీ సీన్ కూడా హైలెట్ గా ఉంటుంది. అతను అంటే ఆమెకు ఇష్టం ఉంటుంది. ఆ విషయం చెప్పడానికి ఆమె చాలా సతమవుతూ ఉంటుంది. ఇక అతను కూడా ఆమె అంటే ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి చాలా వరకు ఇబ్బంది పడి ఎప్పటికో చెప్తాడు. ఇక ఆమె అమెరికా వెళ్ళడం అతను అంతకు ముందే అమెరికా వెళ్ళడం అయినా సరే  వారి మధ్య ఉన్న ప్రేమను బయటకు సరిగా చెప్పుకోలేక ఒకరి మీద ఉన్న ఇష్టాన్ని మరొకరు చెప్పుకోలేక కాస్త ఇబ్బంది పడినా చివరికి మాత్రం ఒకటి అవుతారు. ఆమె పొలాన్ని అతను సాగు చేయడానికి అమెరికా నుంచి వచ్చేయడం ఊళ్ళో క్లీనిక్ పెట్టాలి అని అనుకోవడం ఆమెను పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. 

 

ఇక ఈ సినిమా వసూళ్లు కూడా బాగానే వచ్చాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న పాట కు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి కి తెలుగులో చాలా మంచి ఆఫర్లు వచ్చాయి కూడా. అయినా సరే ఆమె జాగ్రత్తగా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: