సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడూ కలిస్తే నయనతార. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్లద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. 

IHG

ఆ తర్వాత విస్మయతుంబట్టు, తస్కర వీరన్, రాప్పకల్ వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది. ఇక నయన్ కెరీర్ లో 2005 గోల్డెన్ ఇయర్ గా చెప్పొచ్చు. ఆ ఏడాది విడుదలైన సూపర్ స్టార్ రజని చంద్రముఖి, సూర్యగజినీ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి.  ఆ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో తెలుగు దర్శకుల దృష్టి నయనతారపై పడింది. దీంతో ఈ రెండు చిత్రాలతో నయనతార సౌత్ లో స్టార్ గా మారిపోయింది. 

IHG

అప్పటి నుంచి తెలుగు, తమిళ నిర్మాతలు నయన్ కాల్ షీట్స్ కోసం ఎగబడ్డారు. ఆ తర్వాత తెలుగులోనూ లక్ష్మీ, బాస్ వల్లభ, చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక కెరీర్ ప్రారంభంలోనే  రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత‌ లేడి సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. మ‌రియు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.

IHG

ఇక ఒకవైపు గ్లామర్‌ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలుగింటి సీతమ్మగా పేరు సంపాదించుకుంది. అందుకే గ్లామర్ రోల్స్ లో నయా డ్రస్సులతో ఎట్రాక్ట్ చేసినా.. నార చీరలు కట్టి భక్తిపారవశ్యాన్ని ఒలికించినా.. ఈ అమ్మడికు ప్రేక్ష‌కులు ఫిదా అవ్వాల్సిందే. కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళం భాషలలో కూడా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఏలేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో విజ‌యాలు..ఎన్నో రికార్డులు.. మ‌రెన్నో అవార్డులు సొంతం చేసుకున్న‌ న‌మ‌న్ విజేత‌గా నిలిచింది‌. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: