టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికి కూడా గుర్తు ఉంటాయి జనాలకు అని చెప్పాలి. అందులో వెంకటేష్ హీరో గా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్  సినిమాను అయితే జనాలు అసలు మర్చిపోయే అవకాశం ఉండదు. ఆ సినిమా ఎప్పుడు టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా సినిమాను చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా జనాలకు చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఆ సినిమాలో వెంకటేష్ నటన తో పాటుగా హీరో యిన్ గా చేసిన ఆర్తి అగర్వాల్ నటన అన్నీ కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక ఆమె నటన ఈ సినిమాలో హైలెట్ అయింది అని చెప్పాలి. 

 

ఇక ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను ఈ సినిమాలో చాలా అందంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనే చెప్పాలి. ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది. అయితే అది చెప్పడానికి వెంకటేష్ భయపడటం ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ భయపడటం అనేది ఉంటుంది. ఆమె ధైర్యం గా ముందు కు వచ్చి చెప్పేస్తుంది గాని వెంకటేష్ మాత్రం ఆమెకు ఉన్న  స్టేటస్ చూసి చెప్పడానికి కాస్త ఇబ్బంది పడతాడు. ఆ సీన్ లు బాగానే నచ్చాయి జనాలకు. ఆమెకు పెళ్లి కుదిరిన విషయంలో వెంకటేష్ బాగా పడే విధానం కూడా చాలా బాగా నచ్చింది ప్రేక్షకులకు. 

 

అలా ఆ సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుంది అని భావించినా సరే ఆమె మాత్రం కెరీర్ లో వెనకడుగు వేసింది అనే చెప్పాలి. ఈ సినిమాలో నటించిన ఇతర నటులు కూడా బాగానే ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: