ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో మ‌ర్చిపోలేని సినిమాల్లో తొలిప్రేమ సినిమా ఒక‌టి. ఆ సినిమా వ‌చ్చి రెండు ద‌శాబ్దాలు దాటినా కూడా ఇప్ప‌ట‌కీ టీవీల్లో ఆ సినిమా వ‌స్తుంటే ఏదో తొలిసారి.. ఓ కొత్త సినిమా చూస్తామ‌న్న అనుభూతి క‌లుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కీర్తి రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తొలి ప్రేమ సినిమా అప్పట్లో కొన్ని చోట్ల ఏకంగా సంవ‌త్స‌రం రోజుల పాటు ఆడింది. జాతీయ స్తాయిలో ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా కూడా నిలిచింది. జీవీజీ రాజు నిర్మించిన ఈ సినిమాను ఏ . క‌రుణాక‌ర‌ణ్ అత్యంత స‌హ‌జ సిద్ధంగా ఈ ప్రేమ క‌థ‌ను తెర‌కెక్కించారు.

 

ఈ సినిమాలో ప్రేమ స‌న్నివేశాలు అన్ని మ‌న‌స్సును హ‌త్తుకునేలా ఉంటాయి. దేవా అందించిన బాణీలు ఇప్ప‌ట‌కీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేశాయి. హీరో, హీరోయిన్లు ప్రేమ‌... చిలిపి ప‌ద‌నిస‌లు.. చివ‌ర‌కు హీరోయిన్ కెరీర్ కోసం హీరో త‌న పెళ్లిని వాయిదా వేసుకుని నువ్వు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూస్తాన‌ని చెప్పిన స‌న్నివేశాలు.... బీచ్ ఒడ్డున గ‌గ‌నానికి హృద‌యం ఒక‌టే సాంగ్ చిత్రీక‌ర‌ణ ఇవ‌న్నీ సినిమాను ఓ రేంజ్‌లో నిల‌బెట్టాయి. 

 

ఇక ఈ సినిమాలో కుటుంబ సంబంధాలు, బాంధ‌వ్యాలు ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చిత్రీక‌రించారు. ముఖ్యంగా చిచ్చు బుడ్డి సీన్లో హీరోయిన్‌ను చూపించ‌డం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ‌న్నీ ఇప్ప‌ట‌కీ స‌రికొత్త‌గా ఉంటాయి. రెండు ద‌శాబ్దాలు అయినా కూడా ఇప్ప‌ట‌కీ ఈ సినిమా యువ‌త‌రానికి ఓ కొత్త సినిమాలా ఉండ‌డంతో పాటు ప్ర‌తి ఒక్కరు త‌మ ప్రేమ ఇలా ఉంటే బాగుంటుంద‌ని ఫీల్ అయ్యేలా తొలి ప్రేమ ఉంది. అటు వెండితెర‌పై ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా బుల్లితెర‌పై ఎప్ప‌ట‌కీ ఓ సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు ఈ సినిమా సొంతం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: