కొన్ని కొన్ని సినిమాల్లో లవ్ స్టోరీలు  ఎంతో ఆసక్తికరంగా సాగిపోతుంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు  లవ్ స్టోరీ లో ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ఒక భిన్నమైన లవ్ స్టోరీతో  ప్రేక్షకుల ముందుకు వస్తాడు అల్లు అర్జున్. ఇలా చాలా సినిమాల్లో  తెలుగు ప్రేక్షకులకు సరికొత్త లవ్ స్టోరీ ని పరిచయం చేసాడు  అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ నటించిన సినిమాలలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన లవ్ స్టోరీ ఇద్దరమ్మాయిలతో సినిమాలో నుంచి లవ్ స్టోరీ. 

 


 దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్ ఇద్దరి హీరోయిన్ లను ప్రేమలో పడేస్తాడు. కేవలం తన స్టైల్ ఆటిట్యూడ్ తోనే ఇద్దరు హీరోయిన్లను ప్రేమలోకి దించుతాడు అల్లుఅర్జున్. మామూలుగానే యువతలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే చిలిపి చిలిపి పనులు చేసేవారికి అమ్మాయిలు ఈజీగా పడి పోతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో అది నిజమే అని నిరూపించాడు. 

 

 

 అల్లు అర్జున్ కాస్త చిలిపి చిలిపిగా కోతి చేష్టలు చేస్తూనే కోమలిని ప్రేమలో దింపుతాడు. కోమలి పాత్రలో అమలపాల్ నటిస్తుంది. ఇక వీరిద్దరి ప్రేమ ఎంతో సాఫీగా సాగి పోతూ ఉంటుంది, అయితే వీరిద్దరికీ ఒక ప్రాబ్లం ఎదురయ్యి  ఏకంగా వారి కుటుంబం మొత్తం హత్యకు గురవుతుంది. దీంతో అల్లు అర్జున్ పగ తీర్చుకోవాలని భావించి ముందుగా క్యాథరిన్ ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కేథరిన్ కూడా అల్లు అర్జున్ స్టైల్ కి ఆటిట్యూడ్ కి  ఫిదా అయిపోయి అల్లు అర్జున్ తో ప్రేమలో పడిపోతుంది. 

 


 ఇక ఆ తర్వాత మళ్ళి గతంలో ప్రేమించిన కోమలి తిరిగి రావడంతో అసలు కథ మొదలవుతుంది. కోమలి పాత్రలో ఉన్న అమలాపాల్ అల్లు అర్జున్ తో  కలిసి వారి పగ తీర్చుకుంటారు . ఇలా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా ఇద్దరు అమ్మాయిలను తన స్టైల్లో పడేసాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీ  కూడా కాస్త రొటీన్ కు భిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చిన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: