హ్యాపీడేస్ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు  తెచ్చుకొని విభిన్నమైన కథలను ఎంచుకొని అతి త్వరలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్.  ఈ మధ్యనే ఈ యువ హీరో ప్రేమ విహహం కూడా చేసుకున్నాడు. అందరు బయటకు వెళ్లాడానికే బయపడుతుంటే ఈ యువ హీరో మాత్ర తనదైన శైలిలో పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. మొత్తానికి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు.

 

 

లాక్ డౌన్ కంటే ముందే నిఖిల్ కార్తికేయ 2 పనులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే కరోనా ఉన్నా కూడా సక్సెస్ ఫుల్ గా పెళ్లి చేసుకున్న నిఖిల్ ఇప్పుడు కార్తికేయ 2 కోసం ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 


మొత్తానికి నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతకుముందు వరకు వరుస అపజయలతో సతమతమైన విషయం తెలిసిందే. అర్జున్ సురవరం కూడా కొన్ని నెలల పాటు రిలీజ్ కి నోచుకోలేక ఇబ్బంది పడింది. మొత్తానికి రిలీజ్ కావడంతో కుర్ర హీరో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు మరో హిట్టు కోసం కార్తికేయ సీక్వెల్ ని ప్లాన్ చేశాడు.

 


ఇక త్వరలోనే చిత్ర యూనిట్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని విదేశీ పర్యటనకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న తారలు ఏదొక విధముగా ఫాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఇదే సందర్భంలో నిఖిల్ కూడా తన ఫ్యాన్స్ తో మాట్లాడనున్నాడు. ట్విట్టర్ , ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్ , 8 గంటలకు ఇన్స్టాగ్రామ్, 9 గంటలకు ఫేస్ బుక్ లైవ్ ద్వారా  అభిమానులతో ముచ్చటిస్తారు. ఇక నిఖిల్ తో మాట్లాడాలి అనుకునేవారు ఆ టైమ్ కి లైవ్ బటన్ క్లిక్ చేసేయండి మరి....

మరింత సమాచారం తెలుసుకోండి: