నేటి తరం సినిమాల్లో ప్రతి సినిమాలో ఎంతో కొత్తగా లవ్ స్టోరీలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు కూడా సరికొత్తగా తెరకెక్కించిన లవ్ స్టోరీలను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో చూసినా కాస్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీలు  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన కాస్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీ లో ఒకటి గీత గోవిందం సినిమాలోని లవ్ స్టోరీ. విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పెంచింది వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ. 

 


 ఇక ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఏకంగా వంద కోట్ల క్లబ్లో కూడా చేరింది గీతగోవిందం సినిమా. విజయ్ దేవరకొండ క్రేజ్  మరింతగా పెంచేసింది. ఇక ఈ సినిమాలో  లవ్ స్టోరీ విషయానికి వస్తే... ఒక సాంప్రదాయమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్న విజయ్ దేవరకొండ కు  రష్మిక మందన్న కనిపిస్తోంది. ఇక రష్మిక తో ప్రేమలో పడతాడు విజయ్ దేవరకొండ. 

 

 ఇలాగే ఈ లవ్ స్టోరీస్ సాగిపోతుందని ప్రేక్షకులు అనుకుంటారు కానీ ఈ లవ్ స్టోరీ లో  కొత్త ట్విస్ట్ లు  తెరమీదికి వస్తాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఏం చేయకుండానే విజయ్ దేవరకొండ మంచితనానికి పడిపోతుంది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ ను ప్రేమిస్తున్న విషయం కూడా ఎక్కడా బయటికి చెప్పదు. అయితే అది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తెలుస్తుంది కానీ సినిమాలో విజయ్ దేవరకొండ మాత్రం తెలియదు దీంతో ప్రేక్షకులు తెగ  ఎంజాయ్ చేస్తారు . దీంతో చివర్లో రష్మిక ప్రేమ గురించి తెలిసి బ్రతిమాలి మరి రష్మిక ను పెళ్లి చేసుకుంటాడు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: