ఈ మధ్యకాలంలో ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చే ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది కొత్త దర్శకులు వస్తుండడం సరి కొత్తగా లవ్ స్టోరీలను తెరకెక్కితుండటం  లాంటివి చేస్తున్నారు. ఇక తమ తమ సినిమాల్లో రొటీన్గా కాకుండా ఎంతో డిఫరెంట్గా లవ్ స్టోరీ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. దీంతో ఇలా రొటీన్ లవ్ స్టోరీ ఉన్న సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్బస్టర్ విజయాలు సాధిస్తున్నాయి. ఇలా రొటీన్ లవ్ స్టోరీ ఉన్న సినిమాలలో ఒకటి  అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన శాలిని పాండే నటించింది. 

 


 ఇక ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అర్జున్ రెడ్డి సినిమా. అయితే ఈ సినిమాలో లవ్ స్టోరీ ఇప్పుడు వరకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య కాస్త ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ శాలిని పాండే మధ్య ఉండే లవ్ స్టోరీ విషయానికొస్తే... వీరి మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి. 

 


 ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోవడం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య కేవలం చూపులతోనే ప్రేమ పుడుతుంది. ఒక్క చూపుతోనే శాలిని పాండే విజయ్ దేవరకొండ ప్రేమలోకి దింపితే  అదే  ఒక్క చూపుతో విజయ్ దేవరకొండ శాలిని పాండేను ప్రేమలోక దింపుతాడు. ఇలా వీరిద్దరూ ప్రపోజ్ చేసుకోకపోయినప్పటికీ ప్రేమ మాత్రం పడుతుంది. ప్రేమకు భాష కాదు భావం ముఖ్యం అనేది ఈ సినిమా నిరూపించింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య కాస్త ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: