ఓ వైపు ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. దాంతో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి. ఇక కరోనాతో హాలీవుడ్ నటీనటులు కన్నుమూశారు.  నటుడు మార్క్ బ్లమ్ కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.  హాలీవుడ్‌ నటుడు అలెన్ గార్ఫీల్డ్‌ (80) కరోనా చికిత్స పొందుతూ న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక కరోనా లక్షణాలతో హాలీవుడ్‌ నటి హిల్లరీ హీత్‌ (74) మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ‘విచ్‌ ఫైండర్‌ జనరల్‌’ అనే హారర్‌ మూవీ ద్వారా పాపులారిటీ సంపాదించారు హిల్లరీ హీత్‌.

IHG

ఆ తర్వాత ‘నిల్‌ బై మౌత్‌’, ‘యాన్‌ ఆఫుల్లీ బిగ్‌ అడ్వెంచర్‌’ వంటి సినిమాలను నిర్మించారు.  తాజాగా ఆస్కార్ నామినేటెడ్ బ్రిటన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సూపర్ హిట్ అయిన 'లార్డ్ ఆఫ్ రింగ్స్',' ఏలియన్' చిత్రాల నటుడు ఇయాన్ హోల్మ్ కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. 1981లో వచ్చిన చారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రానికి గాను ఆయన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇదే చిత్రానికి గాను ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతూ కన్నుమూశారని ఆయన ప్రతినిధి వెల్లడించారు.

IHG

ఆసుపత్రిలో కుటుంబీకులందరి మధ్యా ప్రశాంతంగా ఆయన తుది శ్వాసను విడిచారని చెప్పారు. ఇయాన్ మరణం హాలీవుడ్ కు తీరని లోటని పలువురు నటీ నటులు సంతాపాన్ని వెల్లడించారు. 'ది మ్యాడ్ నెస్ ఆఫ్ కింగ్ జార్జ్', 'ది ఏవియేటర్', 'ది డే ఆఫ్టర్ టుమారో', 'ది ఫిఫ్త్ ఎలిమెంట్' తదితర చిత్రాల్లో తన నటనకు విమర్శల ప్రశంసలను ఇయాన్ అందుకున్నారు.  ఆయన చివరిగా 2014లో వచ్చిన 'ది హాబిట్: ది బ్యాటిల్ ఆఫ్ ది ఫైవ్ ఆర్మీస్' సినిమాల్లో కనిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: