సినిమా మేకింగ్ పై తపన ఉంటే ఊరికే ఉండనివ్వదు. తనలో ఉన్న టాలెంట్ పదును పెట్టమనే చెప్తుంది. అలా సినిమాపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి దర్శకుడు అయ్యాడంటే అదంతా తనలోని తపనే కారణం. టాలీవుడ్ లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకుని రాణిస్తున్న దర్శకుడు ‘సంపత్ నంది’. 2010లో దర్శకుడిగా ‘ఏమైందీ ఈవేళ’తో పరిచయమై తనలో ఉన్న రైటింగ్, డైరక్షన్ టాలెంట్ ను ప్రూవ్ చుసుకున్నాడు. నేడు సంపత్ నంది పుట్టినరోజు.

IHG

 

ఈ హిట్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే మెప్పించి మలి సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అదే.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రచ్చ’. ఈ సినిమాతో స్టార్ హీరోను డైరక్ట్ చేసే కెపాసిటీ తనలో ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. 2011లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో 40కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తానే స్వంతంగా కథలు తయారు చేసుకునే సంపత్ నంది తన తర్వాతి సినిమాను రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ సినిమా తీశాడు దీని తర్వాత గోపీచంద్ తో తీసిన గౌతమ్ నందా తీశాడు. ఇప్పుడు గోపీచంద్-తమన్నా జంటగా సీటీమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మంచి అంచనాలు నెలకొన్నాయి.

IHG

 

ఫలితాలకు అతీతంగా సంపత్ నంది మీద నమ్మకం ఉంచారు టాలీవుడ్ నిర్మాతలు. సంపత్ నంది సినిమాల్లో యాక్షన్, కామెడీకి పెద్దపీట వేస్తాడు. తన ఏ సినిమా తీసుకున్నా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే అంశాలు ఉండటంతో మినిమం గ్యారెంటీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇవే సంపత్ కు అవకాశాల్ని తెచ్చిపెడుతున్నాయి. నిర్మాతగా మారి సంపత్ నంది ‘గాలిపటం, పేపర్ బాయ్’ సినిమాలు నిర్మించడం విశేషం. రైటింగ్ లో మంచి పట్టున్న సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది డ్రీమ్. తన ప్రయత్నం ఫలించి అగ్ర దర్శకుడిగా రాణించాలని కోరుకుందాం.

IHG'Goutham Nanda' - The Hindu

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: