కొణిదెల వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ వార్త విన్న దగ్గరనుంచి అభిమానుల లో కోలాహలం నెలకొంది.మెగా డాటర్​ నిహారికకు కాబోయే భర్తెవరో తెలిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తానే స్వయంగా ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసింది.అబ్బాయి పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. గుంటూరులోని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడు. ఉన్నత అధికారి పేరు జొన్నలగడ్డ ప్రభాకర్ రావు. ఈయన గుంటూరు ఐజీగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రెండు రకాల స్టోరీలు హల్చల్ చేస్తున్నాయి... అవేంటో తెలుసుకుందామా మరి..

 

 

మొదటి స్టోరీ:

సినిమా తరహాలో ఈ స్టోరీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది . ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ వినడానికి ఆసక్తిగా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం మెగా బ్రదర్ నాగబాబు కి పెళ్లి చేసే సమయంలో ఇప్పుడు నిహారిక కాబోయే మామ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెల్లెళ్లను నాగబాబు ఇచ్చి పెళ్లి చేయాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారట..! కానీ నీ అప్పుడు ఉన్న కొన్ని సందర్భాలు వలన ఆ పెళ్లి జరగలేదని ఇప్పుడు జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తన చెల్లిని మెగా కుటుంబానికి ఇవ్వలేకపోయినా... మెగా కుటుంబం నుంచి కోడలు తెచ్చుకోవాలని ఆశ పడ్డారని అందుకే ఈ పెళ్లి కుదిరిందని కొన్ని ముచ్చట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇది అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. మరి దీన్ని ఎవరు సృష్టించారు నిజమా అని తెలియలేదు.

 

 

 రెండో స్టోరీ:

మెగా డాటర్ నిహారిక కు కాబోయే మామ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు భార్య పేరు పద్మ. ఈ పద్మ తండ్రి వెంకటరత్నం. మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్ రావు, ఈ వెంకటరత్నం ఇద్దరూ మంచి స్నేహితులు అని ఈ విధంగా చిరంజీవికి, పద్మకు చిన్నప్పటినుంచి స్నేహం ఉందని. ఈరోజు ఫ్యామిలీలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని. వీరి మధ్య స్నేహబంధం ఉందని. ఒకరోజు పద్మ తన కుమారుడి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చిరంజీవి తెలపగా ఇప్పటికే ఇండస్ట్రీలో నిహారిక పెద్దగా నిలబెట్టుకోలేదని అందుకే పెళ్లి చేయాలని దృష్టితో ఈ సంబంధం చిరంజీవి ముడి వేశాడని ఈ ముచ్చట చెక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: