టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి నెలకొంది. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు హీరో హీరోయిన్ లు. ఇక రానా పెళ్ళికి సంబంధించి ఇటీవల  ప్రకటన రాగా తాజాగా నిహారిక పెళ్లి గురించి తాజాగా ప్రకటన వచ్చింది. ఈ పెళ్లి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు. స్టార్ హీరో గా ఉన్న రానా పెళ్లి గురించి కూడా అన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి తేదీ 8 ఆగస్ట్ అని వారి కుటుంబం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా నిహారిక పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. నిహారిక పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. 

 

పాప ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ ప్రకటన విషయానికి వస్తే... పెళ్ళిళ్ళు సాధారణంగా కుటుంబాల పెద్దలు మీడియా ముందుకు రావడమో సోషల్ మీడియాలో చెప్పడమో ఏదొకటి జరుగుతూ ఉంటుంది. కాని ఇప్పుడు మాత్రం అది పూర్తిగా మారిపోయినట్టే కనపడుతుంది. పెళ్లి ప్రకటన విషయంలో ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళే చెప్తున్నారు. పెళ్లి మీద జనాలకు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దాన్ని హాట్ టాపిక్ గా మార్చేస్తున్నారు. 

 

రానా నితిన్ పెళ్లి అలాగే హాట్ టాపిక్ అవగా ఇప్పుడు నిహారిక విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతుంది అని చెప్పాలి. ఆమె పెళ్లి చేసుకునే విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో  ఈ పెళ్లి ఎప్పుడు ఏంటీ అనే దాని మీద అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లో యువ హీరోలు అందరూ కూడా పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ప్రభాస్ కూడా పెళ్లి గురించి ఒక ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: