అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు మార్కెట్ ఉండటం అనేది చాలా కష్టం. ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడం అనేది కూడా అంత అమంచిది కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు తెలుగులో నిర్మాతలు  అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. చిన్న హీరోల సినిమాలు అయినా పెద్ద హీరోల సినిమాలు అయినా సరే బడ్జెట్ విషయంలో అలాగే సినిమాలో నటించే వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని భావిస్తున్నారు. 

 

అది ఏంటీ అంటే... హీరోలు ఎవరు అయినా సరే కొందరు మాజీ హీరోయిన్ లు లేదా అమ్మ పాత్రలు అక్క పాత్రలు చేసే వారు కామన్ గా ఉంటారు అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ పాత్రలు చేసే వారి విషయంలో అందరికి కలిపి ఒకే బడ్జెట్ ని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు ప్రగతి ఉంటే ఆమె చేసే ఏ పాత్రకు అయినా ఏ సినిమా అయినా సరే పది లక్షలు అనుకుంటే ఆ పది లక్షలు మాత్రమే ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సరే అదే విధంగా ఇస్తారని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

 

దీనిపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి మరి. చూడాలి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి అయితే అలాగే ఉంది అని అంటున్నారు. ఇతర భాషల్లో ఎక్కువకి డిమాండ్ చేస్తే నటులను అసలు వద్దు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఏయే సినిమాల్లో తగ్గిస్తారు అనేది. కాగా ప్రగతి పవిత్ర లోకేష్ కి డిమాండ్ తగ్గింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: