భారత దేశంలో దేవుడంటే చిన్న నాటి నుంచి భయం.. భక్తి ఉంటుంది. అలా మన కుటుంబ సభ్యులు పెంచుతుంటారు. ఏ మతాల వారైనా తమ భగవంతుడి పై భక్తిని చిన్ననాటి నుంచే తెలియజేస్తారు. అందుకే మన దేశంలో దేవుళ్ళకు సంబంధించిన సినిమాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మ‌నుషుల‌ని దేవుడిగా కొలిచే సంప్ర‌దాయం మ‌న‌దేశంలో ఎప్పటి నుండో ఉంది.  రాజ‌కీయ నాయ‌కుల‌ని, సినీ సెల‌బ్రిటీల‌ని వారివారి అభిమానులు దేవుడిగా కొల‌వ‌డ‌మే కాక గుడులు కూడా క‌ట్టించారు.  అప్పట్లో నటి ఖుష్బూ కి గుడి కట్టించి ఫ్యాన్స్ పూజలు కూడా చేశారని అంటారు.    కప్పుడు టాలీవుడ్ లో రాముడు, కృష్ణుడు అంటే వెంనే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్.

 

ఆయన చిత్రపటాలను ఇంట్లో ఉంచుకొని భక్తితో కొలిచేవారని అనేవారు.  అచ్చం అలాంటిది ఇప్పుడు జరిగింది.  ఎంత మంది నటీ, నటులు వచ్చినా.. అతి కొద్ది మంది మాత్రమే దేవుడు, దేవతలకు బాగా సెట్ అవుతుంటారు. అలాంటి వారిలో ఒకప్పుడు సీతాదేవి అంటే అంజలిదేవి అనేవారు. తర్వాత కేఆర్ విజయ గారు దేవతల పాత్రలకు సెట్  అయ్యేవారు.  ఈ మద్య కాలంలో ఇలాంటి పాత్రలకు వన్నె తెచ్చింది నయనతార ఒక్కరే అని చెప్పొచ్చు. న‌య‌న‌తార ప్ర‌స్తుతం ‌ ‘మూక్కుత్తి అమ్మన్‌’ అనే భక్తి చిత్రంలో అమ్మవారి పాత్రలో నటిస్తోంది.

 

ఇటీవల ఆమె పాత్ర‌కి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు. తొలిసారి అమ్మ‌వారి పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ మురిసిపోయారు. నయనతార అమ్మవారి వేషధారణలో ఉన్న ఫోటోల‌ని పూజించ‌డంకి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. క‌ష్టాల‌లో ఉన్న కుటుంబంకి మూకుతి అమ్మ‌న్ ఎలా స‌పోర్ట్‌గా ఉంటుంద‌నేది వెండితెరపై ఆస‌క్తిగా చూపించ‌నున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల చేయ‌మ‌ని, థియేట‌ర్‌లోనే చిత్రాన్ని వీక్షించాల‌ని స్ప‌ష్టం చేశారు బాలాజీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: