సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుని  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా కన్నడ బ్యూటీ రష్మిక మందన ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది.  ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది  అని చెప్పాలి. స్టార్ హీరోలందరి సినిమాలలో  ఛాన్స్ కొట్టేస్తూ  ప్రస్తుతం తనకు తిరుగులేదని నిరూపించుకుంది రష్మిక మందన. ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ కన్నడ బ్యూటీ... భీష్మ తో మరో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా నటిస్తుంది రష్మిక మందన. 

 


 ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ 100 స్పీడ్ తో దూసుకుపోతుంది . మరో వైపు అటు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటుతోంది రష్మిక మందన. కోలీవుడ్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. అయితే తాజాగా కోలీవుడ్ నుంచి రష్మిక మందన కు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని ప్రస్తుతం టాక్  వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న   చిత్రంలో రష్మిక
 మందన్న ఛాన్స్ కొట్టేసిందట. 

 


వాస్తవంగా  అయితే విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమా లోనే రష్మిక నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కుదరలేదు. కానీ విజయ్ 65 చిత్రంలో మాత్రం రష్మిక ఛాన్స్ కొట్టేసింది అంటూ ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కోడైకూస్తోంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని సమాచారం. ఇప్పటికే విజయ్ మురుగదాస్ కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చి మంచి విషయాన్ని కూడా అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో... బంపర్ ఛాన్స్ కొట్టేసినందుకు రష్మిక ఫుల్ హ్యాపీ గా  ఉంది అంటూ టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: