బుల్లితెర మీద మెగా కామెడీ షో జబర్దస్త్ షో ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో తెలిసిందే. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా జబర్దస్త్ చూసి కాసేపు కడుపుబ్బా నవ్వుకుందామనుకునే ఆడియెన్స్ చాలామంది ఉన్నారు. అందుకే ఆ షోకి విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు నుండి ఈ షో షూటింగ్ చేయలేదు. ఈ షో ఒక్కటే కాదు బుల్లితెర సీరియల్స్, రియాలిటీ షోస్ కూడా ఆగిపోయాయి. లేటెస్ట్ గా సినిమా, టివి రంగాల షూటింగ్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

ఈ క్రమంలో జబర్దస్త్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు అనసూయ తన సోషల్ బ్లాగ్ లో పెట్టింది. అయితే ఈ షోకి పోటీగా షో నుండి బయటకు వచ్చిన వారంతా కలిసి అదిరింది అంటూ స్పెషల్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. జబర్దస్త్ స్టార్ట్ అయినట్టు ఇన్ ఫర్మేషన్ బయటకు వచ్చినా అదిరింది నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు ఈ షో ఉంటుందా లేదా ఉంటే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు అన్న దాని మీద ఇప్పటివరకైతే ఎలాంటి అప్డేట్ రాలేదు.

 

అంతేకాదు అదిరింది షో నుండి నాగబాబు తప్పుకున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి షో స్టార్ట్ అయితేనే గాని ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలుస్తుంది. ఈ షోనే కాదు జబర్దస్త్ షోలో కూడా కాస్ట్ కటింగ్ అని.. అనసూయని తప్పిస్తున్నట్టు వార్తలు రాగా ముందు అనసూయనే షూటింగ్ కు పిలవడం విశేషం. మొత్తానికి జబర్దస్త్ హంగామా మళ్లీ బుల్లితెర మీద కనిపిచబోతుంది. అయితే తగిన జాగ్రత్తలతోనే షూటింగ్ నిర్వహిస్తారని తెలుస్తుంది.                         

మరింత సమాచారం తెలుసుకోండి: