టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో మంచి హీరో గా పేరు తెచ్చుకున్న నితిన్ ఇప్పుడు వరుస విజయాలతో కెరీర్ లో పీక్ స్టేజి లో ఉన్నాడు అనేది వాస్తవం. ఇక టాలీవుడ్ లో ఇప్పుడు అతనికి క్రమంగా క్రేజ్ అనేది పెరుగుతుంది. గతంలో అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం తో అతనిని పక్కన  పెట్టిన వారు అందరూ కూడా ఇప్పుడు అతనికి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరో గా ఆయనకు పేరు ఉండేది. కాని ఈ మధ్య కాలంలో చేస్తున్న మంచి సినిమాలతో స్టార్ హీరో గా మారిపోయాడు అనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతను రీమేక్ సినిమాల మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. రీమేక్ సినిమాలు అతనికి బాగా కలిసి వస్తాయి అనే నమ్మకం ఉంది అని అంటున్నారు. అతను ఇప్పుడు తమిళం లో ఒక కథను కొనడానికి గానూ ఏకంగా చెన్నై వెళ్లి అక్కడ మాకం వేసాడు అని అంటున్నారు. కథ బాగా నచ్చింది అని సినిమా కథ కోసం అతను అవసరం అయితే రికమండేషన్ కూడా చేయించాలి అని భావిస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు. 

 

అతను ఆ కథ కోసం గానూ ఇప్పటికే ఒక స్టార్ హీరో తో కూడా మాట్లాడినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను అతను ఎలా అయినా సరే తెలుగులో చెయ్యాలి అని చూస్తున్నాడు అనేది టాలీవుడ్ జనాల మాట. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు నితిన్ ఈ కథ కోసం గానూ దాదాపు రెండు నెలల నుంచి చెన్నై వెళ్తూ వస్తున్నాడు అని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: