కథ ఏ విధంగా ఉన్నా సరే నానీ సినిమా చేస్తే అది హిట్ అని భావిస్తారు టాలీవుడ్ లో ఆయన అభిమానులు. ఇప్పుడు నానీ కూడా అదే ఆలోచనలో ఉండి ఏ కథ పడితే ఆ కథ ను ఇన్ని రోజులు ఓకే చేస్తూ వచ్చాడు. కొన్ని కొన్ని అతనికి బాగానే ప్లస్ అయినా మరి కొన్ని మాత్రం భారీ షాక్ ఇచ్చాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడు నానీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి. 

 

ఇప్పుడు అసలు విషయానికి వచ్చి చూస్తే నానీ ఒక విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడు కథలను వినే విషయంలో తన భార్య సలహాలను అతను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కథల విషయంలో గతంలో మాదిరిగా అతనిలో స్వేచ్చ అనేది లేదు అని ఇప్పుడు భయపడుతున్నాడు అని వరుస ఫ్లాప్ లు రావడం తో అతని కెరీర్ ప్రమాదం లో పడింది అని ఇప్పుడు అతనికి ఒక మంచి సినిమా అనేది అవసరం అని అందుకే జాగ్రత్త పడుతున్నాడు అని అంటున్నారు. 

 

చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. అతను ఇప్పుడు రెండు సినిమాలను ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఒక తమిళం లో సూపర్ హిట్ అయిన రీమేక్ సినిమాను కూడా తెలుగులో చేసే ప్లాన్ నానీ చేస్తున్నాడు అని సమాచారం. మరి ఆ ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు నానీ చేస్తున్న రెండు సినిమాలు కూడా పండగలను టార్గెట్ చేసి వస్తున్నావే అనే సంగతి తెలిసిందే. చూడాలి మరి ఎప్పుడు సినిమాలను విడుదల చేస్తాడు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: