టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏది అయినా కథ ఏ విధంగా ఉన్నా సరే మహేష్ బాబు ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం కూడా భయపడే అవకాశం ఉండదు అని టాలీవుడ్ వర్గాలు అంటూ ఉంటాయి. మహేష్ బాబు కూడా చాలా వరకు ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు అనే ప్రచార౦ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మహేష్ కథల విషయంలో చాలా వరకు ఆలోచన చేసి సినిమాలను ఓకే చేస్తాడు అని అంటారు. అయితే ఇప్పుడు అతనికి రీమేక్ సినిమాలను నిర్మించాలి అనే కోరిక ఎక్కువైంది అని అంటారు. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు అతను చేసే సినిమాల మీద ఆసక్తి ఉంది. నిర్మాతగా మహేష్ బాబు ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చెయ్యాలి అనే ఆసక్తి చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక అతని సినిమాల విషయంలో మాత్రం భార్య నమ్రత పెత్తనం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు అతని తో ఒక తమిళ సినిమాను కొనాలి అని ఆమె అంటున్నట్టు సమాచారం. కథ ఆమె విన్నదని ఆ కథ లో సినిమాను ఇక్కడ మహేష్ నిర్మాతగా అయినా సరే ఏదోక విధంగా చేయడం మంచిది అని అది మంచి హిట్ అవుతుంది అని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. 

 

ఆమె చెన్నై లో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ కథను ఎలా అయినా తీసుకోవాలి అని చూస్తుంది అని సమాచారం. ఇక్కడ శర్వానంద్ తో సినిమా చేయడానికి గానూ ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.  మరి ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని కూడా తీసుకోవాలి అని భావించినట్టు తెలుస్తుంది.  టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: