ఇప్పుడు టాలీవుడ్ లో పుష్ప సినిమా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు కచ్చితంగా చదివే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఇప్పుడు అగ్ర హీరోలు చాలా వరకు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. దాదాపుగా అగ్ర హీరోల సినిమాల్లో ప్రయోగాలు ఉంటేనే అభిమానులు అయినా సరే చూసే పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇక మన తెలుగులో ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో బన్నీ సాహసం చేస్తున్నాడు అని చాలా మంది అంటూ వస్తున్నారు. ఈ సినిమాలో అతను నటన విషయంలో ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు అని కూడా టాక్. 

 

అది ఏంటీ అంటే ఒక  విధంగా ఈ సినిమా కోసం అతను ప్రాణం పెట్టి మరీ పని చేసే పరిస్థితి వచ్చింది అని టాక్. అలా ఎందుకు ఏంటీ అనేది ఎవరికి తెలియదు గాని ఈ సినిమా కోసం ఏకంగా 10 కేజీల వరకు బరువు పెరిగాడు అని సమాచారం. అదే విధంగా దుంగలు ఎత్తుకుని పరుగులు తీస్తున్నాడు. రాళ్ళల్లో పరుగులు తీస్తున్నాడు. చీకట్లో కూడా పరుగులు తీస్తున్నాడు అని సమాచారం. అదే విధంగా చెట్లు ఎక్కడం కూడా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని సమాచారం. చెట్లు ఎక్కే విషయంలో అతను ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. అది ఎందుకు ఏంటీ అనేది తెలియదు గాని ఇటీవల అతను అడవులకు కూడా వెళ్ళాడు అని సమాచారం. 

 

సుకుమార్ తో కలిసి బాబు ఈ విధంగా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: