తెలుగు సినిమాల్లో ప్రీవియస్ జనరేషన్ లో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. శివ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలే కాకుండా.. తన జనరేషన్ లో ఆధ్యాత్మిక సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించిన ఘనత నాగార్జునకు ఉంది. ప్రస్తుతం వయసుకు మించిన ఫిజిక్ తో తన కుమారులతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు నాగ్. కొత్త జనరేషన్ దర్శకులతో సినిమాలు చేయడం నాగ్ కు అలవాటు. ప్రస్తుతం నాగ్ కొత్త సినిమాకు సంబంధించి ఓ న్యూస్ రౌండ్ అవుతోంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MANMADHUDU 2' target='_blank' title='manmadhudu 2-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>manmadhudu 2</a> Trailer Is All ...

 

ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగార్జున చేయబోయే సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. చందమామ కథలు, గరుడవేగ సినిమాలతో ఇప్పటికే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త రౌండ్ అవుతోంది. ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త రౌండ్ అవుతోంది. ప్రస్తుతం సోలోమన్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న వైల్డ్ డాగ్ లో ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

IHG

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత ‘నా రాత నేనే రాసుకుంటా’ తెరకెక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం రౌండ్ అవుతున్న ఈ గాసిప్ పై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. మరి.. దీనిపై ప్రవీణ్ సత్తారు స్పిందిస్తాడో.. నాగార్జున కన్ఫర్మ్ చేస్తాడో చూడాల్సిందే. ప్రస్తుతం షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: