ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో  సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ చేయటం డైరెక్టర్లకు కష్టమైపోతుంది. స్టోరీ నిర్మాత అంత సెట్ అవుతున్న గానీ హీరోయిన్ విషయంలో ప్రాజెక్టులు చాలా వరకు ఆగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి అదేవిధంగా ఇంకొంతమంది స్టార్ సీనియర్ హీరోలకు ఎక్కువుగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున కూడా ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీ లో రైడ్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారట.

 

సినిమా కోసం నాగార్జున సరికొత్త హీరోయిన్ తన పక్కన నటింపజేయడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగిందట. నాగార్జున ఏజ్ ఎక్కువ అవటంతో చాలామంది హీరోయిన్లు అవకాశం వచ్చినా నటించడానికి ఆలోచిస్తున్నట్లు ఛాన్స్ లు వదులుకున్నట్లు వార్తలు అందుతున్నాయి . ఇదిలావుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రైడ్ సినిమా లో అజయ్ దేవగన్ పక్కన నటించిన హీరోయిన్ ఇలియానాని ఈ సినిమాలో నటింపచేయాలని సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం.

 

ఈ నేపథ్యంలో ఇలియానాని ఎలాగైనా నటింపజేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారట,  ఒక్క మాట ఒకే అని చెప్పమ్మా.. ప్లీజ్ అన్నట్టుగా బతిమిలాడుతున్నట్లు  టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. సినిమా స్టోరీ మొత్తం ఒకే అయినా హీరోయిన్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఆగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. వరుసగా నాగార్జునకి ఇటీవల ఫ్లాపులు రావటంతో ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని మంచి కసి మీద ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సొలోమోను అనే డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే రైడ్ సినిమా మొదలు పెట్టాలని నాగార్జున ఆలోచిస్తున్నట్లు టాక్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: