ప్రస్తుతం అన్ని సినిమాలు తిరిగి షూటింగ్స్ ని మొదలు పెట్టుకోవాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం అయిపోయిందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి లాక్ డౌన్ నేపథ్యంలో 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన పనులన్ని ఎక్కడివి అక్కడే స్థంభించిపోయాయి. అయితే ఈ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా విదేశాలలో షూటింగ్స్ ఇప్పట్లో వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా విరమించుకున్నారు మన మేకర్స్.

 

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా నలభై శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ముఖ్యంగా ధారివి ప్రాంతంలో ఎక్కువ భాగం షూటింగ్ జరపాలనుకున్నారు. అంతేకాదు బ్యాంకాక్, గోవా లోను టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ ప్లాన్ చేశారు పూరి. అయితే ముంబై మొత్తాన్ని కరోనా మహమ్మారి వ్యాపించడం తో మొత్తం షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేశారు. అందుకే పూరి విజయ్ సినిమాని హైదరాబాద్ లోనే సెట్స్ వేసి షూట్ చెయ్యాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సెట్స్ వేస్తున్నట్టు ముందుగా హీరో హీరోన్స్ మీద సాంగ్స్ తీయాలని రెడీ అవుతున్నారట.

 

ఇక ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. ఆస్ట్రియా, జార్జియా, యూరప్ అంటూ బయలుదేరారు. తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం కరోనా పరిస్థితి విదేశాలకు షూటింగ్స్ కోసం వెళ్లే పరిస్థితి లేదు. అందుకే రాధాకృష్ణ ప్రభాస్ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న రాధాకృష్ణ ఫారెన్ లో షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలను ఇండియాలోనే షూట్ చేసేలా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. 

 

అంతేకాదు పుష్ప సినిమా కోసం కూడా సుకుమార్ కొంత భాగాన్ని విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసి డ్రాపయ్యారు. ఇప్పుడు ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ చేయాలనుకుంటున్న సినిమాలకి రామోజీ ఫిల్మ్ సిటీనే ఛాయిస్ అయింది. అంతేకాదు ఈ సినిమాలన్నిటితో ఫిల్మ్ సిటీ ఖాళీ లేకుండా తయారవబోతుందని అంటున్నారు. మరి ఇన్ని సినిమాల షూటింగ్స్ ఒకే దగ్గర జరిగితే కరోనా ని ఎలా కంట్రోల్ చేస్తారో అని మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: