తెలుగు తమిళ ఇండస్ట్రీలలో మహానటి సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకుంది కీర్తి సురేష్. అప్పటి వరకు చేసిన కమర్షియల్ సినిమాల కంటే మహానటి సినిమా తీసుకు వచ్చిన క్రేజ్ అండ్ పాపులారిటి అసాధారణం. ఇక ఈ సినిమాతో నేషనల్ అవార్డు ను సాధించుకుంది. మరోసారి ప్రేక్షకులందరు కీర్తి సురేష్ లో సావిత్రిని చూసుకున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత కీర్తి తనకి వచ్చిన పాపులారిటీని దృష్ఠిలో పెట్టుకొని కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు  తీసుకుంటుంది. అందులో భాగంగానే హీరోలతో రొమాన్స్ చేసే కథలను కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా ఒకే చేసింది. మహానటి తర్వాత మళ్ళీ  అంతటి బజ్ క్రియోట్ అయిన పెంగ్విన్ సినిమాతో కీర్తి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

 

సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. ఒకరకంగా చెప్పాలంటే కీర్తి సురేష్సినిమా మీద పెట్టుకున్న ఆశలన్ని కాస్త తలకిందులైనట్టే. ఇప్పుడు ఇదే తన కెరీర్ మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుందన్న టాక్ మొదలైంది. ఇక కీర్తి చేతిలో ప్రస్తుతం మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ.. సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్ చూస్తుంటే అందరు కీర్తి సురేష్ కూడా నయనతార అనుష్క ల మాదిరిగా తన కెరీర్ ని డేంజర్ లో పడేసుకోబోతుందా అని మాట్లాడుకుంటున్నారు. 

 

సేఫ్ అనుకుందా లేక అనూహ్యంగా జరిగిందా తెలీదు గాని రాబోయో సినిమాలు కూడా హీరోయిన్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలే. మహానటి.. పెంగ్విన్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ సినిమాలన్ని తన మీద ఆధారపడి తెరకెక్కుతున్నవే. ఇంతక ముందు అనుష్క నయనతార కూడా ఒక భారీ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సక్సస్ కొట్టి ఆ తర్వాత కూడా అదే ఫార్ములాని కంటిన్యూ చేసి ఇప్పుడు బిక్కు బిక్కు  మంటున్నారు.

 

ఈ లిస్ట్ లో ఎక్కడ కీర్తి సురేష్ చేరుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. మరి ఇది దృష్ఠిలో పెట్టుకొని కీర్తి సురేష్ కాస్త కమర్షియల్ సినిమాలు ఒప్పుకుంటే కెరీర్ బావుంటుందని చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: