రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఫీలవుతున్నారు. లాక్ డౌన్ సమయం లో ఎన్టీఆర్ పుట్టిన రోజు వచ్చిన టైములో ఖచ్చితంగా సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేస్తారని భావించారు. కానీ సరిగ్గా వర్క్ కాకపోవటంతో తారక్ లుక్ రిలీజ్ చేయలేకపోతున్నట్లు సినిమా యూనిట్ చెప్పుకు రావడం జరిగింది. దీంతో నందమూరి అభిమానులకు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ లుక్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. మరోపక్క ప్రభుత్వాల నుండి షూటింగులకు పర్మిషన్ వచ్చేసింది.

 

మరి ఇటువంటి సమయంలో అయినా రాజమౌళి కనికరిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఆ గుడ్ న్యూస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు బట్టి ఇంత భారీ బడ్జెట్ సినిమాకి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ అంటే ప్రాబ్లం అని సినిమా యూనిట్ భావిస్తోందట. దీంతో పరిస్థితి కొన్నాళ్ళు సద్దుమణిగాక కరోనా వైరస్ కంట్రోల్ అయ్యాక సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.

 

ప్రస్తుతం షూటింగ్ కోసం అంతా సెట్ రెడీగా ఉన్నా గాని స్టార్ట్ చేయడం అంటే అది రిస్కుతో కూడిన పని అని సినిమా యూనిట్ భావిస్తున్నారు అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు బ్రేక్ పడటంతో ఈసారి ఇటువంటి టైం లో మరోసారి పడకూడదని రాజమౌళి పక్కా ప్లానింగ్ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని సినిమా షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: