వారు సెలిబ్రిటీలు, తెర వెనక ఉంటారు. వెండితెర విచ్చుకోగానే అక్కడ నిండారా కనిపిస్తూ కనివిందు చేస్తూంటారు. రీళ్ళకు రీళ్ళు ఎన్నో విన్యాసాలను, సాహసాలను చేస్తూ కనికట్టు చేస్తారు. వారి ప్రేమ, అభిమానం, వారి గొప్పతనం అన్నీ కూడా రీళ్ళకు రీళ్ళు చూసి పెద్ద ఎత్తున  ఫ్యాన్స్ తయారవుతారు. 

IHG

అయితే రీల్ లైఫ్ లాగానే రియల్ లైఫ్ ఉండదు, అలా ఉండకూడదు కూడా. అయితే రీల్ లైఫ్ లో తారలను అలాగే ఊహించుకుని అభిమానులు అలాగే వారిని అక్కడ ఉంచేసుకుంటారు. కళ్ళకు కట్టేసుకుని నెత్తిన పెట్టేసుకుంటారు. సరే వారిది వెర్రి మొర్రి అభిమానం అనుకున్నా సెలిబ్రిటీలు కూడా అలాగే అదే రీల్ లైఫ్ లోనే ఉండిపోతున్నారు.

IHG

అందుకే వారు కూడా వాస్తవాలు తట్టుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే వారు ఒక ప్రశ్న వేసినా ఇబ్బంది పడిపోతారు. ఇన్నాళ్ళూ మీడియా ఉండేది. వారు వేసే ప్రశ్నలకు కొంత ఇరకాటంగా ఇరిటేషన్ గా సెలిబ్రిటీలు ఫీల్ అయ్యేవారు. ఇపుడు ఏకంగా సోషల్ మీడియా వచ్చేసింది. దాంతో నేరుగా ఫ్యాన్స్ వారికి ఎదురవుతున్నారు. అలాగే క్రిటిక్స్ కూడా అక్కడ పెద్ద ఎత్తున తయారవుతున్నారు.

IHG

బహుశా ఊహించని ప్రశ్నలు అక్కడ ఎదురైతే మాత్రం మన సెలిబ్రిటీలు ఎక్కడా  తట్టుకోలేరు. దాంతో సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నామని ఓ ఫైన్ మార్నింగ్ గంభీరమైన స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. బయట ఉంటేనే ప్రశాంతత ఉంటుందని కూడా అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అశాంతి రేగుతోందా. మరి అలా ఎవరు చెప్పారు. ఎందుకు అలా అనుకుంటున్నారు. 

IHG

నిన్న త్రిష, నేడు సోనాక్షీ సిన్హా  ఇలా ఇద్దరూ కూడా దాదాపుగా ఒకే  కారణం చెబుతూ ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు. తమకు ప్రశాంతత కావాలని వీరు చెప్పడం విశేషం. మరి ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్ గా ఉంటే అది దొరకడంలేదా. చూడాలి ఎందుకలా వారు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా రియల్ లైఫ్ లో రియల్ కళ్లతో, ఆలోచనలు చేస్తే అంతా ప్రశాంతంగా ఉంటుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: