" స్వర్గం నరకం " మూవీతో టాలీవుడ్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు మోహన్ బాబు. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన నటనతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. గత 44 ఏళ్లుగా ఇండస్ట్రీలో నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మోహన్ బాబు పిల్లలు సైతం టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి ఇద్ద‌రు హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. క‌లెక్ష‌న్ ‌కింగ్ మోహ‌న్‌బాబు వార‌సులుగా వ‌చ్చిన ఆ ఇద్ద‌రి ఆట కొన్నాళ్ల పాటు సాగినా ఎందుక‌నో ఆ త‌ర్వాత పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. మంచు విష్ణు ఇప్ప‌టి వ‌ర‌కు 22 చిత్రాల్లో న‌టించినా ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాన్ని సాధించింది. అదే `ఢీ`. ఈ చిత్ర విజ‌యంలోనూ రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి పాత్ర‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి.

 

IHG


ఇక ఇదే ఫ్యామిలీకి చెందిన మ‌రో హీరో మంచు మనోజ్‌. సినిమా అంటే విప‌రీత‌మైన పిచ్చి వున్న హీరో. అయితే అత‌ను చేసిన సినిమాల్లో `బిందాస్‌`, `నేను మీకు తెలుసా` చిత్రాలు త‌ప్ప ఏదీ అంత‌గా ఆక‌ట్టుకోలేదు.దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మ‌నోజ్ సినిమాల‌కు గుడ్‌ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. తాజాగా అత‌ని భార్య‌తో విడాకులు తీసుకున్న త‌రువాత మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టి నిర్మాత‌గా కొత్త సినిమా మొద‌లుపెట్ట‌బోతున్నాడు.

IHG

 

 

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు మంచు లక్ష్మీ. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా విలక్షణ గొంతుతో అభిమానులకు చేరువయ్యారు. ఇటీవలే తన కూతురుతో కలిసి యూట్యూబ్‌ లో ‘చిట్టి చిలకమ్మ’ అనే ఛానల్‌ పెట్టిన లక్ష్మీ.. పిల్లల పెంపకంపై వీడియోలు చేస్తున్నారు. కరోనా కారణంగా మంచు ఫ్యామిలీ 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల ప్రజలకు ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను ఆహార పదార్ధాలను సరఫరా చేయడంతో పాటు మాస్క్ లు, శానిటైజర్లను అక్కడి ప్రజలకు అందిస్తు వారి మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: