హరికృష్ణ తన ఇద్దరు కుమారులు అయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ల సినీ విజయాలను చూస్తూ ఎంతో ఆనందపడేవారు. తన 55-60 ఏళ్ల మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని దూసుకెళ్తున్న సమయంలో హరికృష్ణ ఎంతో సంతోషపడేవారు. నందమూరి తారకరామారావు తర్వాత ఆ స్థాయి లో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ వంటి కొడుకు ఉంటే ఏ తండ్రి అయినా తెగ సంతోష పడతారు. తారక్ కి కూడా తండ్రి హరికృష్ణ అంటే అత్యంత ఇష్టం. 

IHG
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఇజం సినిమా ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. అదే సమయంలో నందమూరి హరికృష్ణ కూడా ఇజం సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చేసరికి తారక్ వెంటనే ఉత్సాహపడి తన తండ్రి పాదాల వద్ద మోకాళ్ళపై కూర్చుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. దీన్నిబట్టి తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఆ దేవుడు తండ్రి కొడుకులను వేరు చేశాడు. ఆరోజున జూనియర్ ఎన్టీఆర్ పడిన బాధ మాటల్లో వర్ణించలేనిది అని చెప్పవచ్చు. 

IHG
తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడని, అటువంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదని జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో బాగా ఎమోషనల్ అయ్యి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అరవింద సమేత ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తండ్రి హరికృష్ణ గురించి ఎన్నో విషయాలను చెప్పి అందర్నీ కంటతడి పెట్టించాడు. 

IHG
ఏదేమైనా నందమూరి కుటుంబంలో తారక రామారావు, హరికృష్ణ అర్ధాంతరంగా చనిపోవడం తెలుగు ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. సినీ, రాజకీయ రంగాలలో కొనసాగుతూనే తన కుటుంబ సభ్యులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ తన సమయాన్ని హరికృష్ణ గడిపేవారు. అంతా అద్భుతమైన వ్యక్తి మరణించాడు అని తెలిసి ఆ నిజాన్ని చాలా ఏళ్ళ వరకు జీర్ణించుకోలేకపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: